Book Description
శాపవశాత్తూ భూమిపై జన్మించిన అప్సరస శ్యామ. విధివంచిత కూడా. పెళ్ళయినరోజునే భర్తని పోగొట్టుకుంది. పిచ్చివాడిగా తిరిగే రాజీవ్‍ని ప్రేమించి ఇంటినుంచి వెళ్ళ గొట్టింపబడుతుంది. ఆశ్రయం పొందిన ఇంటిలో ఆమెకో ఆరాధకుడు ఎదురు పడతాడు. అతని బారినుంచి తప్పించుకుని పొరపాటున వేశ్యాగృహానికి చేరుతుంది. అక్కడి నుంచి ఆమెని కాపాడి తనదానిని చేసుకుంటాడు సురేష్, జన్మంతా అతనికి ఋణపడిపోయిన శ్యామ, తన ప్రేమని ఎలా గెలవగలుగుతుంది? సురేష్ ఆమెకి స్వేచ్ఛని ఇస్తాడా? రాజీవ్ ఏం అయ్యాడు? ఇవన్నీ తెలియాలంటే తప్పక చదవండి.