Sahithi Prachuranalu

ASTADHALAM

ASTADHALAM
ASTADHALAM

ASTADHALAM

Rs. 80.00 Rs. 100.00
  • SKU: 15193314

Category : NOVEL

Publisher : Sahithi Prachuranalu

Author : Polkampalli Santhadevi

Language : TELUGU

Book Description

కేతకి ఒక కోయ యువతి. మొగలి రేకంత అందమైన ఆమె... స్వభావం మాత్రం మొగలి పువ్వంత కరుకైనది. ఎందరో కోడెకారు యువకులు ఆమె మనసు గెలుచుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటే ఆమె ఒక తాంత్రీకుడి మీద మరులుగొంటుంది. అతి చిన్న వయసులోనే మంత్రశాస్ర్తంలో అతి కఠినమైన విషయాలనెన్నింటినో సాధన చేసి అణిమాది అష్టసిద్ధులు పొందినవాడు. అతడి పేరు తిమ్మడు. ఆ రోజుల్లో ఒక రాజావారు అనేకానేక దేశాలమీద దండెత్తి కొల్లగొట్టి తెచ్చిన అపారమైన ధనరాశి మణిమాణిక్యాలు, బంగారం నల్లమల్లలోని చిట్టడవిలో ఒక గుహలో నిక్షిప్తం చేస్తూ ఆ తాంత్రికుడి సాయం కోరతాడు. ఆ తాంత్రికుడు తన వెంటపడిన కేతకిని ఆ ధనరాశికి బలిహారంగా సమర్పించి ఆమె ఆత్మను నిధికి కాపలాగా ఉంచుతాడు. ఆ గుహకున్న ఒక పెద్ద బండరాయి తలుపు మీద ఆమె బొమ్మను చెక్కుతాడు. ఆ గుప్త నిధికి కాపలాగా ఉన్న కేతకి ఆ చుట్టు ప్రక్కలకి ఎవరినీ రానివ్వదు. తిమ్మడిచేత హతురాలైన కేతకి ఆత్మ అతీత శక్తులు పొంది అతడి మీద పగబడుతుంది. ‘జన్మజన్మలకి వెంటాడతాను. వేటాడతాను’ అని ప్రతిన పూనుతుంది. తిమ్మడు మణిచంద్రభూపాల్గా జమీందారు ఇంట్లో పుడతాడు. కేతకి చంద్రరేఖగా పుట్టి అతడి కాముకత్వానికి బలి అవుతుంది. తిరిగి ప్రేత రూపం పొంది అతడి చావుకి కారణమవుతుంది. అతడు మళ్ళీ జయసూర్యగా అదే బంగళాలో పుడతాడు. అమెరికాలో మెడిసిన్ చేసొచ్చిన జయసూర్యను చంద్రరేఖ ఆత్మ పీడిస్తూ అతడి జీవితం విషాదాంతం కావడానికి కారణమౌతుంది. అతడు మళ్ళీ శ్రీచక్రగా పుడతాడు. గత జన్మ జాపకాలు అతడిని కలల రూపంలో బాధిస్తుంటాయి. కలలలో ఆమె ఆత్మ అతడిని వెన్నాడుతూ ఉంటుంది. గతజన్మలలో శక్తి ఉపాసకుడూ, మారుతి ఉపాసకుడూ అయిన శ్రీచక్ర ఈ జన్మలో భైరవగుహలో తాను నిక్షిప్తం చేసిన గుప్తనిధిని కైవసం చేసుకొన్న కథ ఆసక్తికరంగా సాగుతుంది.

Additional information
Code SPBK-312
SKU 15193314
Category NOVEL
Publisher Sahithi Prachuranalu
Author Polkampalli Santhadevi
Language TELUGU
Book Reviews
Add REVIEW

Related Products

Newsletter