Book Description
ప్రేమ, అనురాగం, ఆరాధన తొణికిసలాడే అతడి విస్పారిత నేత్రాల్లోకి చూస్తూ ఆ చూపుల్లోనే నా జీవితం బంధింపబడితే మనసుకు ఎంత హాయి, బ్రతుక్కి ఎంతటి భాగ్యం అనిపించింది ఒక్కక్షణం. కాని, ఆ అదృష్టాన్ని ఒకనాడు చేతులారా పాడుచేసుకొన్నానని స్ఫురించేసరికి విషాదభరితమైపోయింది హృదయం. ‘‘ఎందుకు చేశానలా? సంఘమిత్రాను కావాలనా? పేరుకు సంఘమిత్రను అయినాను గాని సంఘానికి ఎంతవరకు మిత్రురాలిని కాగలిగాను? ఇది తేల్చవలసింది భవిష్యత్తు. ఇప్పుడు మాత్రం శత్రుమిత్రుల మధ్య ఊగుతున్నాను. కిరణ్ కవ్వింపుకు యిలా లొంగిపోతే నాన్నకు యిచ్చినమాట ఎంతవరకు నిలబెట్టుకోగలను?’’