Sahithi Prachuranalu

maina

maina
maina

maina

Rs. 165.00 Rs. 175.00
  • SKU: 151257925

Category : NOVEL

Publisher : Sahithi Prachuranalu

Author : Seela Veerraju

Language : TELUGU

Book Description

పంజరంలో మైనగోరు నిద్రలేవడంతోనే ‘రామ రామ’ అంది. స్వేచ్ఛను సహృదయంతోనే పంజరంలో పెట్టి బంధించిన మానవుడు ఆవలించి లేచాడు. సాదరంగా ఓసారి దాన్ని పలకరించి అవతలకు వెళ్ళిపోయాడు. \nసాయి యింకా నిద్ర లేవలేదు. కలలో రెక్కలగుర్రంమీద ఎక్కడికో యెగిరి పోతున్నాడు. మైనా రెండుసార్లు పేరెట్టి పిలిచింది. సాయి అన్నయ్యలేచి సాయిని లేపాడు. సాయి లేవకుండానే విసుక్కున్నాడు. \n‘‘నీ మైనా పిలుస్తోందిరా. ఇంకా నిద్రేనా, లే’’ అంటూ ఒక్క కుదుపు కుదిపాడు. అయినా లేవలేదు. మైనా మరోసారి పిలిచింది. \nసాయి వొళ్ళు విరుచుకుని, లేచి నిల్చుని పంజరం దగ్గరకు వచ్చాడు. మైనా ఒక్కసారి రెక్కల్ని టపటపా కొట్టుకుని ఆనందంగా తల ఊపింది. పంజరంలోంచి దాన్ని తీసి బుగ్గమీద పొడిపించుకొని, ముఖం కడుక్కుందామని దొడ్లోకి పరుగెత్తాడు. \nమైనా మెల్లగా ఎగురుతూ వచ్చి నీళ్ళడేగిశా మీద వాలింది. వచ్చేప్పుడు సాయి పంజరం తలుపులు వేసిరాలేదు. ‘పోనీలే ఇవ్వాళ నీకూ ఆగష్టు పదిహేను’ అనుకున్నాడు అక్కడకొచ్చిన దాన్ని చూసి. \nమైనా అరుస్తోంటే ఆలోచనల్ని తెంపుకొని అటు చూశాడు. ఎలా వచ్చిందో నల్లపిల్లి మైనాను నోట కరుచుకొని పారిపోతోంది. పళ్ళ సందుట్లో మైనా ప్రాణం గిజగిజలాడుతోంది. \nసాయి పెద్దగా అరచుకొంటూ దాన్ని వెంబడించాడు. ఆ వెనకనే సాయి అన్నయ్యా, వాళ్ళమ్మా పరుగెత్తారు. \nచేజిక్కిన ఆహారాన్ని అది సులభంగా వదిలేయ దలుచుకోలేదు. మూడు నాలుగు యిళ్ళు తిప్పింది. గోడలు దూకింది. చివరకు ఓ యింటి అటకెక్కి కూర్చుంది. \nసాయి నిచ్చెన తెచ్చి అట•• ఎక్కాడుగాని అప్పటికే నీరసించిపోతోన్న మైనా అరుపు ఆఖరిసారిగా వినిపించి ఆగిపోయింది. \nసాయి కళ్లు నీళ్ళతో తడిసిపోయాయి. \nఆ రోజు స్కూలుకు వెళ్ళలేదు. ఇంట్లోనే కూర్చున్నాడు

Additional information
Code SPBK-923
SKU 151257925
Category NOVEL
Publisher Sahithi Prachuranalu
Author Seela Veerraju
Language TELUGU
Book Reviews
Add REVIEW

Related Products

Newsletter