Sahithi Prachuranalu

Chitralekha

Chitralekha
Chitralekha

Chitralekha

Rs. 52.00 Rs. 65.00
  • SKU: 151127515

Category : NOVEL

Publisher : Sahithi Prachuranalu

Author : Chalasani Vasumathi

Language : TELUGU

Book Description

భారతీయ సంస్క•తిపట్ల, కుటుంబ వ్యవస్థ పట్ల అవగాహన కల్గి, నవలా రచయితగా సుప్రసిద్ధులైన శ్రీమతి చలసాని వసుమతిగారు ఆంధ్రా యూనివర్సిటీ నుండి ఎమ్‍.ఏ. జబల్‍పూర్‍ యూనివర్సిటీ నుండి ఎమ్‍.ఏ పట్టాను పొందారు. దక్షిణభారత హిందీ ప్రచార సభ నుండి ‘విశారద’, అలహాబాద్‍ యూనివర్సిటీ నుండి ‘సాహిత్యరత్న’లను పొందారు. వీరు అనేక వ్యాసాలు, కవితలు, కుంతల, భ్రమరగీతం, యశోదకృష్ణ మొదలైన నవలలను రచించారు. నేషనల్‍ ఆర్గనైజేషన్‍ ఫర్‍ ఉమెన్‍ డెవలప్‍మెంట్‍ సోషల్‍ సర్వీస్‍వారి ఆధ్వర్యంలో ‘‘విశిష్ట నేటి మహిళ సేవ’’ పురస్కారం పొందారు. వీరు రచించిన ఈ నవల పాపపుణ్యాల ప్రశ్నలకు సమాధానము వివరిస్తుంది. పాపము అంటే ఏమిటి? దాని నివాసమెక్కడో తెలుసుకోవాలంటే భోగి బీజగుప్తుడు యోగికుమార గిరులకు ఒక సంవత్సరం సేవ చేయమని ప్రశ్నలడిగిన శిష్యులు శ్వేతాంబరుడు, విశాలదేవిలకు సలహా ఇస్తారు గురువు రత్నాంబరుడు. సంవత్సరానికి తిరిగి వచ్చిన శిష్యుల అభిప్రాయాలను ఖండిస్తూ పాపానికి పుణ్యానికి గురువు ఇచ్చిన నిర్వచనం ఇది. ‘‘ఈ సృష్టిలో పాపమనేది పుణ్యమనేది ఏమీ లేదు. మనిషి విషమతలపట్ల అతని దృష్టికోణానికి పాపమని పుణ్యమని పేర్లు పెట్టారు. మానవుడు తన జన్మలో ఏది చేయాలో విధి నిర్ణయప్రకారం జరుగుతుంది’’ అని తన అభిప్రాయాన్ని వివరించాడు గురువు.

Additional information
Code SPBK-513
SKU 151127515
Category NOVEL
Publisher Sahithi Prachuranalu
Author Chalasani Vasumathi
Language TELUGU
Book Reviews
Add REVIEW

Related Products

Newsletter