Sahithi Prachuranalu

VIJAYA

VIJAYA
VIJAYA

VIJAYA

Rs. 48.00 Rs. 60.00
  • SKU: 15187256

Category : NOVEL

Publisher : Sahithi Prachuranalu

Author : Sarath

Language : TELUGU

Book Description

ఆ ముగ్గురు విద్యార్థులనూ హుగ్లీ బ్రాంచి స్కూలు హెడ్‍ మాస్టరుగారు తమ విద్యాలయం రత్నాలుగా భావించేవారు. ఆ ముగ్గురూ వేరు వేరుగా మూడు దారులగుండా ప్రతిరోజూ ఓ కోసు దూరం నడిచి వస్తుండేవాళ్ళు. ముగ్గురూ పరస్పరం ఎంతో ప్రేమతో వుండేవాళ్ళు. ఆ ముగ్గురు మిత్రులూ మార్గమధ్యంలో ఓ మర్రిచెట్టు క్రింద ప్రతిరోజూ సమావేశమవుతూ, ఆ తరువాత స్కూలుకు వెళ్ళేవాళ్ళు. ముగ్గురి ఇళ్ళూ హుగ్లీకి పడమటి దిక్కుగానే ఉండేవి. ఈ ముగ్గురు కుర్రవాళ్ళు, పట్టణంలో ఏదయినా ఇల్లు అద్దెకు తీసుకొని వుండకుండా, వానలకూ, వరదలకూ భయడపకుండా, చలికీ ఎండకూ బాధపడకుండా, ప్రతిరోజూ ఇంత దూరం కాలినడకనే వస్తూ పోతూ వుండడానికి కారణం ఒకటి వుంది. ఆ కాలంలో ఏ తల్లిదండ్రులూ తమ ముద్దు బిడ్డలు పడుతున్న ఈ కష్టాన్ని ఓ కష్టంగా లెక్కించేవాళ్ళు కాదు. కష్టపడనిదే ఆ తల్లి సరస్వతీదేవి కరుణించదని, ఆమె దీవెన ఉండదనీ వారి భావన. కారణమేదయినా ఆ ముగ్గురు మిత్రులూ ఇదే విధంగా వస్తూపోతూ హైస్కూలు పరీక్ష పాసయ్యారు. ప్రతిరోజూ ఆ మర్రిచెట్టు క్రింద కూర్చొని, ముగ్గురు మిత్రులూ ‘జీవితంలో మనం విడిపోగూడదు, ఎన్నడూ పెళ్ళి చేసుకోగూడదు. ముగ్గురం ప్లీడర్లమై ఒకే యింట్లో వుండాలి, డబ్బు సంపాదించి ఒకే బాక్సులో వేయాలి. ఆ డబ్బుతో దేశసేవ చేయాలి’ అని ప్రతిజ్ఞ చేస్తూ ఉండేవాళ్ళు. ఇవి వారి బాల్య జీవితపు ఊహా జగత్తులోని విషయాలు. ఊహలు కాకుండా, యధార్థమయిన దాని రూపం, చివరకు ఏమయిందో క్లుప్తంగా తెలియాలంటే చదవండి శరత్‍ నవల ‘విజయ’.

Additional information
Code SPBK-254
SKU 15187256
Category NOVEL
Publisher Sahithi Prachuranalu
Author Sarath
Language TELUGU
Book Reviews
Add REVIEW

Related Products

Newsletter