Vijayam Andhariki Sadyame

Vijayam Andhariki Sadyame

Sale price  Rs. 80.00 Regular price  Rs. 90.00
Skip to product information
Vijayam Andhariki Sadyame
1/2

Vijayam Andhariki Sadyame

Sale price  Rs. 80.00 Regular price  Rs. 90.00

Vijayam Andhariki Sadyame by Vidiyala Chakravarthi

విజయాక్షరాలు ‘విజయం అంటే ఏమిటి?’ అంటూ నిర్వచనంతో ప్రారంభించి.. ఓటమి నుంచి విజయానికి ఎలా ప్రయాణించాలో కూడా వివరించారు. వ్యక్తిత్వ వికాస సాహిత్యానికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఈ పుస్తకానికున్నాయి. శైలి సరళంగా సూటిగా సాగింది. చదవడం పూర్తయ్యాక... విటమిన్ టాబ్లెట్ వేసుకున్నంత అనుభూతి కలుగుతుంది. విజయం కోసం మంచి పుస్తకం విజయం అందరికీ సాధ్యమేనంటూ విడియాల చక్రవర్తి రచించిన ఈ పుస్తకంలో వ్యక్తిత్వం వికసించిననాడే మనిషి మహా‘మనిషి’గా ఎదగ గల్గుతాడని పేర్కొంటూ-అనేక శీర్షికలతో, ప్రముఖుల సూక్తులతో, సందర్భాన్ని బట్టి కార్టూన్లతో ప్రచురించడంతో పుస్తకానికి పరిపూర్ణత చేకూరింది. విజయ సాధనకు మార్గదర్శి రచయితగా, వక్తగా ప్రత్యేకించి వ్యక్తిత్వ వికాస శిక్షకుడిగా విశేష అనుభవం ఉన్న విడియాల చక్రవర్తి రాసిన ఈ పుస్తకంలో ఐదు విభాగాలుగా ఉన్న మొత్తం 50 అంశాలను రచయిత వివరించారు. ఈ 50 మెట్లు విజయవంతంగా అధిరోహించగలిగితే మీరు విజయపతాకాన్ని ఎగురవేసినట్టే. అసాధ్యాన్ని సుసాధ్యం చేసే పుస్తకం నిత్యం శ్రమిస్తూ, అవరోధాలెన్ని ఎదురైనా ఛేదించుకుంటూ విజయపథంలో నడవాలని, అందుకు కావలసిన సలహాలు, వ్యూహాత్మక మార్గాలు ఈ ‘విజయం అందరికీ సాధ్యమే’ అనే పుస్తకంలో చక్కగా పొందుపరచబడ్డాయి.

Sold by Sahithi Prachuranalu, Rukmini Kalyanam Telugu Book, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store

You may also like