Tegina Gnapakalu Thummapudi Sanjeevdev
Tegina Gnapakalu Thummapudi Sanjeevdev
Thummapudi Sanjeevdev Tegina Gnapakalu
తెగిన గ్నపకాలు BY తుమ్మపూడి సంజీవ్దేవ్
గత కొన్ని సంవత్సరాలుగా సంజీవదేవ్గారి అభిమానులు కాలగర్భంలో కలిసిపోవటం జరుగుతుంది. ఇప్పుడు సంజీవదేవ్గారి సన్నిహితులు పదిమంది కూడా లేరు అనేది పచ్చి నిజం. సంజీవదేవ్ను ముందుతరాలకు తెలియజేసే మార్గం పుస్తకాలే కదా! వ్యాపారపరంగా సంజీవదేవ్ పుస్తకాలకు ఆదరణ తక్కువ కనుక ప్రచురణకర్తలు ఆ పని చేయరు. మనసు ఫౌండేషన్ ద్వారా వారి గ్రంథాలను డిజిటలైజ్ చేయటం జరిగింది. ఇప్పుడు నాకు ‘ఎమెస్కో’ విజయ్కుమార్గారు, ‘సాహితి ప్రచురణ’ల లక్ష్మిగారు దొరకటం ఎంతో ఆనందంగా ఉంది. ఒక ప్రణాళికాబద్ధంగా వారితో సంజీవదేవ్గారి పుస్తకాలు వెలుగుచూస్తాయనే నమ్మకం నాకు కలిగింది. మొదటగా వారు ‘తెగిన జ్ఞాపకాలు’ ఎన్నుకోవటం జరిగింది. ‘దీనికి ముందుమాట ఉంటే బాగుంటుంది’ అని లక్ష్మిగారు అన్నారు. అందువలన నేను, నా ‘తెగని జ్ఞాపకాలు’ దీనికి అనుమేళనగా ఉంచే సాహసం చేస్తున్నాను. నా సాహసానికి కారణాలు కొన్ని తెలియజేస్తాను.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store