Sri Devi Bhagavatham

Sri Devi Bhagavatham

Sale price  Rs. 340.00 Regular price  Rs. 400.00
Skip to product information
Sri Devi Bhagavatham

Sri Devi Bhagavatham

Sale price  Rs. 340.00 Regular price  Rs. 400.00

Sri Devi Bhagavatham by Aynampudi Gurunatharao

శ్రీ దేవీ భాగవతం

శతావధాని కీర్తిశేషులు శ్రీ కోట వీరాంజనేయ శర్మగారి ఎమెస్కో వచన రామాయణము ప్రచురణ పూర్తికాగానే - అనూహ్యంగా శ్రీ దేవీ భాగవతమును వచన రూపంలో వెలువరించాలని సంకల్పం కలిగింది. అష్టాదశ పురాణాంతర్గతమగు దేవీ భాగవతమును ఆంధ్రీకరణ ఆంధ్రలోకమునకు విశేషోపకారమని వేరుగ చెప్పనక్కరలేదు గదా! ఈ సంకల్పము కలుగుటయే తరువాయి - మా చూపులు - సంస్క•తాంధ్ర ఆంగ్ల హిందీ భాషా చతుర్ముఖులు విద్వాన్ శ్రీ అయినంపూడి గురునాథరావుగారి దెస ప్రసరించాయి. వీరు ఈ వరకే - పండితరాయలు, మేఘసందేశం, విజయ ప్రస్థానం, కవితా ప్రభాస, కోదండరామశతకం మున్నగు పద్యకావ్యాల్ని, హనుమత్సందేశం (సుందరకాండ), గురునాధ రామాయణ బాల అయోధ్య కాండలు - గానం చేయుటకు వీలుగా గేయకావ్యంగాను వెలువరించి పలువురి ప్రశంసలను పొందియున్నారు. వీరి హనుమత్సందేశం (సుందర కాండ గేయకావ్యం) వాడవాడలా శ్రీ వారణాసి లక్ష్మీ నరసింహమూర్తి గారిచే - సప్తాహాలు పర్యంతము గానము చేయబడుతూ వేలాది ప్రజలను సమ్మోహితపరుస్తూన్నది. ఈయనలోని ఈ వైశిష్ట్యమును గుర్తించి శ్రీ దేవి భాగవతమును సరళ వచన సరళిలో మూల విధేయంగా ఆంధ్రీకరింపుడని కోరియున్నాము. కోరినదే తడవుగా గృహపరిస్థితులు ఆహ్లాదకరముగా లేకున్నను తాదాత్మ్యముతో, వినమ్ర భావముతో, ఒక పట్టుదలతో ఈ కార్యక్రమమును చేబట్టి రచన సాగించినారు. పాఠకులకు మేము లోగడ చెప్పిన ప్రకారము ఈ వచన శ్రీ దేవీ భాగవతము ఇప్పుడు అందజేయుచున్నాము. ఈ మహా కార్యక్రమమునకు పాఠకులు సహృదయముతో చేయూత నిచ్చెదరు గాక.

You may also like