Priyathama O Priyathama Swargamlo Khaidheelu

Priyathama O Priyathama Swargamlo Khaidheelu

Sale price  Rs. 135.00 Regular price  Rs. 150.00
Skip to product information
Priyathama O Priyathama Swargamlo Khaidheelu
1/2

Priyathama O Priyathama Swargamlo Khaidheelu

Sale price  Rs. 135.00 Regular price  Rs. 150.00

Priyathama O Priyathama Swargamlo Khaidheelu Balabhadrapatruni Ramani

ప్రియతమా ఓ ప్రియతమా బలభధ్రపాత్రుని రమణి

ఈ నవలని రమణిగారు అతి చిన్న వయసులో రాయడం ఒక విశేషం. ఓ కన్నెని విధవరాలిగా మార్చడంతో మొదలైన సనాతన కధ మరో 3,4 పేజీల్లోనే అల్ట్రామోడరన్ అమెరికన్ బేస్డ్ కధగామారి అక్కడినుంచి ఊహాతీతమైన మలుపులతో ముగియడం నిజంగా పాఠకుల్ని అబ్బురపరుస్తుంది. ఆనాటి సనాతనాచారులైన బ్రాహ్మణ కుటుంబాలలో ఈ నవలా నాయకి లాంటి అరుంధతులెందరో! కన్నెపిల్లలు వయసొచ్చి కాపురానికొచ్చేసరికి వారి ఐదవతనం వసివాడిపోవడం చాలా సాధారణంగా జరుగుతుండేది. అప్పటినుండి జపతపాలతో మిగిలిన జీవితం అంతా నిస్సారంగా గడిపేయడం తప్పవారికి ఇంకో మార్గం కనిపించేది కాదు. పదహారేళ్ళకి విధవకీ, పదహారేళ్ళ కన్నెపిల్లకీ కోర్కెల విషయంలో పెద్దతేడా వుండదు. వారిని ఈ విధంగా శిక్షించవద్దని గురజాడలూ, వీరేశలింగంగారూ వాదించినా ఈ సమాజం అంగీకరించలేదు. ఫలితంగా ఎంతోమంది అరుంధతులు తమ జీవితాలు పుష్పించకుండానే మోడువారిపోయారు. వారి జీవితాల్లోనూ వసంతం రావాలనీ, తోడుకోసం ఎదురుచూసేవారికి ఆదర్శవంతులు తమ హస్తాన్ని అందించి కళ్యాణ తిలకం దిద్దాలనీ ఆశిస్తూ...

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store

You may also like