Mudrasaastra Rahasyaalu

Mudrasaastra Rahasyaalu

Sale price  Rs. 180.00 Regular price  Rs. 200.00
Skip to product information
Mudrasaastra Rahasyaalu
1/2

Mudrasaastra Rahasyaalu

Sale price  Rs. 180.00 Regular price  Rs. 200.00

Mudrasaastra Rahasyaalu BY By Swami Maitreya

ముద్రాశాస్త్ర రహస్యాలు

మన శరీరమంతా నరాల ద్వారా అనుసంధానింపబడిన ‘ఎలక్ట్రానిక్ సర్క్యూట్’ వంటిది. దాని ‘టర్మినల్స్’ వేలి కొనల్లో నిగూఢమై ఉన్నాయి. చేతి వేళ్ళకొనలను శక్తివాహకాలుగా చెప్పుకోవచ్చు. వేళ్ళలోని ఆ ‘పాయింట్స్’ని నిర్దుష్టమైన రీతిలో కలపడం ద్వారా మన శరీర తత్వాలను మనం అనుకున్న రీతిలో నియంత్రించుకోవడం సాధ్యపడుతుంది. చేతివేళ్ళ ఈ టర్మినల్ పాయింట్స్ని కలపడమే ‘ముద్ర’. పూజా విధానంలోనూ, యోగాభ్యాసంలోనూ, నాట్యకళలోనూ ముద్రలను ఉపయోగించడం మనం చూస్తుంటాం. దేవుళ్ళ, దేవతల మూర్తులన్నీ ‘అభయముద్ర’లోనూ, దీవనలిస్తున్నట్లుగానూ రూపొందిస్తుంటారు. ఈ ముద్రల ప్రభావాన్ని తెలుసుకోవాలంటే, శారీరక తత్వాలను, దోషాన•లు, పంచభూతాలను సమన్వయపరిచే టి.వి. రిమోట్లాంటి స్విచ్లు మన శరీరంలో ఎక్కడున్నాయో తెలుసుకోవడం ముఖ్యం. వీణలోని తీగలు బిగింపు, సడలింపులను అనుసరించే కదా సంగీతంలో తారాస్థాయి, మంద్రస్థాయిలను నియంత్రించడం సాధ్యపడుతుంది. అలాగే, శారీరక తత్వాలను సమన్వయపరచుకోవడానికి చేతివేళ్ళను కావలసిన రీతిలో అమర్చడం ఎలాగో తెలుసుకోవడం అతి ముఖ్యం. ముద్రా విజ్ఞానం శరీరం మనసుల మధ్య సామ్యాన్ని కుదిర్చి మనకు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని కల్గిస్తుంది.

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store

You may also like