Mahadevuni Kasi Kshetram
Mahadevuni Kasi Kshetram
Mahadevuni Kasi Kshetram KK Mangapathi
మహాదేవుని కాశీ క్షేత్రం కె.కె. మంగపతి
అనాదిగా కాశీపురం నందు పలు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పురాణాల ప్రకారం కాశీ పురం మధ్యమేశ్వరాన్ని కేంద్రంగా చేసుకొని అయిదు యోజనాల విస్తీర్ణంలో ఉండేది. స్కంద పురాణంలోని నాగరా ఖండం ప్రకారం నాలుగు యుగాలలో కాశీ క్షేత్రం విభిన్న ఆకారాలను సంతరించుకుంది. సత్యయుగంలో త్రిశూలం ఆకారంలో ఉండేది. త్రేతా యుగంలో చక్రం ఆకారంలో, ద్వాపర యుగంలో రథం ఆకారంలో, కలి యుగంలో శంఖం పోలిన ఆకారంలో ఉంది.
ప్రాచీన కాలం నుండి భరత వంశం, బ్రహ్మదత్త వంశం, గహదవాల వంశం మరియు ముస్లిం పాలకులు, బ్రిటిష్ కాలంలో భూమిహార్ బ్రాహ్మణ వంశానికి చెందిన మహారాజుల పాలనలో కాశీ ఉంది. వీరి పాలనలో కాశీ క్షేత్రంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. కాశీ విశ్వనాథ్ ఆలయ ప్రాంతం చుట్టూ రద్దీని పరిష్కరించడానికి కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్ట్లో భాగంగా 2019-2021లో గేట్వేను నిర్మించారు. కారిడార్ ప్రాజెక్ట్లో భాగంగా ప్రాచీన కట్టడాలు నిర్మూలించి నూతన నిర్మాణాలు చేపట్టడం జరిగింది. మహాదేవుని కాశీ క్షేత్రం యాత్రాదర్శిని అను పుస్తకమునందు ప్రస్తుత కాశీ వీధులు, దేవాలయాలు, మందిరాలు, గంగా ఘాట్లు, యాత్రా ప్రదేశాల సమాచారం మరియు యాత్రా ప్రయాణం • సమీప వసతి గదుల సౌకర్యాల గురించి వివరించడం జరిగింది
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store