Harilal Gandhi

Harilal Gandhi

Sale price  Rs. 100.00 Regular price  Rs. 150.00
Skip to product information
Harilal Gandhi
1/2

Harilal Gandhi

Sale price  Rs. 100.00 Regular price  Rs. 150.00

Harilal Gandhi: A Life by Chandulal Bhagubhai Dalal

హరిలాల్ గాంధీ చందులాల్ భాగుభాయి దలాల్

హరిలాల్ గాంధీ మహాత్మాగాంధీ, కస్తూర్బా గాంధీల పెద్దకొడుకు. అతడి జీవితం గురించి మనకు తెలిసింది చాలా స్వల్పం. నిగూఢంగానూ, ఆకర్షణీయంగానూ ఉండే ఆ వ్యక్తిత్వం ఈ మధ్యకాలంలో ఎన్నో ఊహాగానాలకు కేంద్రబిందువయింది. ఈ పరిస్థితుల్లో హరిలాల్ గాంధీ జీవితంపైన చందులాల్ భాగుభాయి దలాల్ రాసిన ఈ జీవితకథ ఒక్కటే మనకు లభ్యంగా ఉన్న పూర్తిస్థాయి జీవితచిత్రణ. గాంధేయవాఙ్మయంలో ఒక మైలురాయిగా చెప్పదగ్గ రచన. చుట్టూ అల్లుకున్న అనేక అపోహలనుంచీ, ఊహాగానాలనుంచీ, నీడలనుంచీ తప్పించి ఒక జీవితవాస్తవాన్ని ఉన్నదున్నట్టుగా ప్రతిపాదించడానికి పూనుకున్న ప్రయత్నం.
గుజరాతీలో రాసిన ఈ రచనను త్రిదీప్ సుహృద్ ఇంగ్లీషులోకి అనువదించడం కేవలం అనువాదానికే పరిమితమైన విషయం కాదు. హరిలాల్ గాంధీ జీవితాన్ని చందూలాల్ దలాల్ గుదిగుచ్చిన క్రమంతోపాటు, త్రిదీప్సుహృద్ కూడా ఇంతదాకా ముద్రితంకాని ఉత్తరాలనుంచీ, వివిధ రచనలనుంచీ ఎంతో సమాచారం సేకరించి మనకందించారు. త్రిదీప్ సుహృద్ సేకరించిన సమాచారం, చందూలాల్ రాసిన జీవితకథ - ఇవి రెండూ కలిపి ఇంతదాకా మనకు హరిలాల్ గాంధీ మీద లభ్యమైన అత్యంతసమగ్ర సమాచారం.
ప్రముఖ రచయిత, అనువాదకుడు, కేంద్రసాహిత్యఅకాడమీ పురస్కారగ్రహీత వాడ్రేవు చినవీరభద్రుడు ఈ రచనను ఇంగ్లీషునుంచి తెలుగులోకి అనువదించారు.

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store

You may also like