Yendukee Sande Gaali
Yendukee Sande Gaali
Yendukee Sandhe Gaali by Balabhadrapatruni Ramani
పెళ్ళికాని అందమైన సాఫ్ట్వేర్ ఇంజనీరు మందార మాల. యూఎస్‌లో స్నేహితురాలు శాలినీ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ సంజయ్ మందారమాల హృదయాన్ని ఆకట్టుకుంటాడు. ఇంటిమసీ పెరుగుతుంది. అతడు యూఎస్ నుంచి ముంబయ్‌లో మందార ఫ్లాట్‌కి రావడం, వాళ్ళిద్దరూ అనుకోకుండా మున్నార్ వెళ్లడం, వారి తనువులు ఏకమైపోవడం కలలోలా జరిగిపోతుంది. ఇంతలో యూఎస్ నుండి శాలూ వస్తుంది. ‘సంజూతో నా పెళ్ళి సంగతి గురించి నువ్వే మాట్లాడాలి మందారా!’ అని శాలూ అడగ్గానే షాక్ తింటుంది. సంజూని శాలూకి తాను త్యాగం చెయ్యాలా? అని సందిగ్ధంలో పడుతుంది మందార. తప్పు చేశాననీ, సంజూ తనను పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతుంది మందార. శాలినీ తండ్రి అంత్యక్రియలు దగ్గరుండి జరిపిస్తాడు సంజూ. శాలినీ కూడా సంజూ మీద చాలా ఆశలు పెంచేసుకుంటుంది. అవన్నీ మందారకే ఫోన్లో చెబుతుంది. మందార మనసు కుతకుతలాడిపోతుంది. మింగలేక కక్కలేక దిగులుపడుతూ చివరకు ఓ రోజు సంజూని నిలదీస్తుంది. నిన్నే పెళ్ళి చేసుకుంటాననీ, అయితే తన ఆశయం నెరవేరేదాకా రెండేళ్ళు వేచి ఉండాలనీ మందారను అడుగుతాడు సంజూ. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ నవల చదవాల్సిందే.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store