Chinthana
Chinthana
Chinthana By VS RamaDevi
మనుస్మృతినాటినుండి వస్తూన్న సాంఘికసూత్రాలలో నుండి స్త్రీ స్వాతంత్ర్యము పురుషులతో సమానహక్కులువంటి ఆధునిక అభిప్రాయాలలోకి, క్రమపరిణామము చెందుతూన్న భారతనారి, లేక ఆంధ్ర మహిళ, ఆధునిక మనః ప్రవృత్తి భావుకురాలైన రమాదేవి భావాలలో స్పష్టంగా కనపడుతుంది ఈమె రచనలు చదువుతూంటే. అందుకే వేదకాలంలో వేదాంత జిజ్ఞాస చేసిన గార్గియో, మైత్రేయో బౌద్ధయుగంనాటి యశోధరో, ఆమ్రపాలీయో, ఇంకా ఆయా యుగాలనాటి యే మహిళ లేకపోతే చలంగారి యే స్త్రీపాత్రో రచయిత్రి మనోభావాలలో తాదాత్మ్యం పొంది స్త్రీ అంటే విశ్వసుందరి, విశ్వప్రియ, విశ్వజనని అనే ఆదర్శాన్ని తలపింపచేస్తూంటుంది. స్త్రీలు కవయిత్రులైనా, రచయిత్రులైనా వారిస్వభావంలోను, రచనలోను పురుష సహజమైన కరకుతనమూ, మోటుతనమూకుడా తొంగి చూడడం కద్దు. అలావుండక, కోమలంగాను, సుకుమారంగాను వ్రాసే కొద్ది మంది రచయిత్రులలో రమాదేవి ఒకరు. పైగా ఈమె న్యాయవాద పట్టభద్రగూడ కావడంచేత ఆమె భావన సుతర్క నిర్దిష్టమై సూటిగా వుంటుంది. "మనిషి దేవుడిగా మారడానికి సంఘం సాధనంగా ఉపయోగపడాలి. వ్యక్తి సంఘానికి విరోధి కాడు. సంఘం వ్యక్తిని తనచేతిలో కీలుబొమ్మని చేసుకొనే నియంతకాదు. వ్యక్తిమనుగడకి అతనిని తన గమ్యానికి చేర్చడానికి ప్రకృతిమాత ప్రసాదించిన స్నేహశీలి, సుగమమార్గం మాత్రమే-సంఘం!" ఇంతటి ఉదారాశయాలూ, విశాలదృష్టి, నిశితమైన తర్కమూ, మధురమైన శైలీ గల శ్రీమతి రమాదేవి వ్యాససంపుటి పుస్తకరూపంలో ఇతోధికంగా పాఠకుల్ని ఆకర్షించి, వారి అభిలాషపైని ఆమె ఇతోధిక జిజ్ఞాసాపూర్వకమైన సంపుటాలను వెలువరించాలని హృదయపూర్వకంగా ఆశిస్తూ, ఆశీర్వదిస్తున్నాను. -బాలాంత్రపు రజనీకాంతరావు
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store