Ardhika Vyavasthaku Yuddam Sega
Ardhika Vyavasthaku Yuddam Sega
Ardhika Vyavasthaku Yuddam Sega by Tummala Kishore
శ్రీ తుమ్మల కిశోర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణాజిల్లా జయపురంలో 1953 ఏప్రిల్ 12న జన్మించారు. అమ్మ తుమ్మల పరిమళ, నాన్న తుమ్మల నారాయణరావు.
విద్య: బి.కాం, ఎస్ఆర్ఆర్ & సీవిఆర్ ప్రభుత్వ కళాశాల, విజయవాడ. ఎం.కాం, భోపాల్ విశ్వవిద్యాలయం.
వృత్తి: ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌లో 35 ఏళ్ల పాటు వివిధ హోదాల్లో, దేశంలోని పలుప్రాంతాల్లో పనిచేశారు. 2013లో ఛీఫ్ మేనేజర్ పదవీ విరమణ చేశారు. బ్యాంకింగ్ రంగంలో మూడున్నర దశాబ్దాల అనుభవంతో ఆర్థిక రంగంపై మంచిపట్టు సాధించారు.
ప్రవృత్తి: 1988లో 'ఈనాడు' దినపత్రికలో 'జర్మలిస్టు' ప్రస్థానాన్ని ప్రారంభించి, వ్యాసకర్తగా, కాలమిస్టుగా అంచెలంచెలుగా ఎదిగారు. బ్యాంకింగ్, ఆర్థికాంశాలపై 'ఈనాడు'లో 800కు పైగా రాసిన వ్యాసాల ద్వారా ఆయన విశ్వసనీయతగల విశ్లేషకుడిగా పేరుపొందారు. ఆయన అంతకుముందు రాసిన 'సెక్యూరిటీల కుంభకోణం', 'పెద్దనోట్ల రద్దు’, ‘మాంద్యం ముంగిట దేశం', 'దేశ ఆర్థికప్రస్థానంలో ఎన్నెన్నో మైలురాళ్లు', 'స్థిరీకరణ దిశగా బ్యాంకింగ్ రంగం', 'సంపద సృష్టికి శతకోటి మార్గాలు' పుస్తకాలు బహుళ ప్రజాదరణ పొందాయి.
అంతర్జాతీయ సంక్షోభాలు మన దైనందిన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో సామాన్య పాఠకులకు సైతం సులభ శైలిలో అర్థమయ్యేలా 'ఆర్థిక వ్యవస్థకు యుద్ధం సెగ' పుస్తకాన్ని రాశారని భావిస్తున్నాను. సమకాలీన ఆర్థిక సవాళ్లపై సమయానుకూలమైన పుస్తకాన్ని తెలుగు పాఠకులకు అందించిన తుమ్మల కిశోర్‌కు నా హృదయపూర్వక అభినందనలు.
- ముప్పవరపు వెంకయ్య నాయుడు 13వ భారత ఉపరాష్ట్రపతి
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store