Andhra Yuvakuda-Dari Itu

Andhra Yuvakuda-Dari Itu

Sale price  Rs. 40.00 Regular price  Rs. 50.00
Skip to product information
Andhra Yuvakuda-Dari Itu

Andhra Yuvakuda-Dari Itu

Sale price  Rs. 40.00 Regular price  Rs. 50.00

Andhra Yuvakuda-Dari Itu by Yaddanapudi Sulochanarani ఆంధ్రయువకుడా దారి ఇటు - యద్దనపూడి సులోచనారాణి

చాలా జీవితాల్లో దారుణమైన సంఘటనలెన్నో వుంటాయి. కానీ మానవత్వం సిగ్గుపడాల్సిన సంఘటనలు ఎదురవటం అరుదు. డబ్బే జీవితంగా భావించిన భవానీప్రసాద్ జీవితంలో అలాంటి సంఘటన జరిగింది. మనసు సిగ్గుతో చచ్చిపోయి, మనిషిని జీవచ్ఛవంలా మార్చిన ఆ సంఘటన ఏమిటి? షేమ్-కథ చదవండి. తెలుస్తుంది.

నిరుద్యోగం, కలసిరాని పరిస్థితులు గోపాలాన్ని పీల్చి పిప్పి చేశాయి. అసమర్థుడని అందరూ వేలెత్తి చూపించారు. తనకి జరిగిన అవమానాలెన్నో సహించిన గోపాలం, శాంతకీ జరిగిన అవమానాన్ని సహించలేకపోయాడు. అగ్నిజ్వాలలా జ్వలించాడు. ఫలితం ఏమిటో, ఏం జరిగిందో తెలిపేకథ-అసమర్థుడు.

ఆర్థిక అసమానతలతో, పెద్దవారి అధికారానికి బానిసల్లా బతుకులు వెళ్ళదీస్తున్న బడుగు బతుకుల్తో, రోజురోజుకీ దిగజారుతున్న తన గ్రామం ఒకవైపు… జీవితాన్ని సుఖప్రదంగా, మూడుపువ్వులు ఆరుకాయలుగా మార్చగలిగిన విదేశీ జీవితావకాశం ఒకవైపు… రవి ఏ మలుపు తిరిగాడో తెలుపుతూ, యీనాటి యువతరానికి దారి సూచించే కథ-ఆంధ్రయువకుడా! దారి ఇటు.

అనుకోని పరిస్థితులెదురై, భార్యనని చెప్పుకోలేకపోయినా భర్తనే అంటిపెట్టుకుని జీవితాన్ని జయించిన జయకథ – భార్య.

ప్రతి పదం దృశ్యంలా కళ్ళముందు కదిలేలా రాసిన కథలు రెండైతే విస్తృతమైన కథాసారాన్ని సంఘటనల్లా మలచి కూర్చిన కథలు రెండు. రచనా విధానంలో మార్పుని, రసస్పందన కలిగించటంలో నేర్పుని అవగతం చేసుకోటానికి.

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store

You may also like