Book Description
”నీ కోసం నువ్వు బతుకు… ఎవర్నీ నీకోసం బతకమని అడక్కు” - అయాన్ ర్యాండ్. ”ఒంటెలాంటోడు మనిషి. తనకు తానే మోకరిల్లి తన భుజాల మీద అనవసరమైన బరువులు ఎక్కించుకుని ఆ తరువాత బతుకు భారమైపోయిందని ఏడుస్తాడు” - ఫ్రెడ్రిక్ నీషే. ”నీ కళ్ళతో నువ్వు చూస్తున్నావు కాబట్టే ప్రపంచం అనేది ఒకటుందని నీకు తెలుస్తుంది… నువ్వు కళ్ళు మూసుకుంటే దానికి మనుగడ లేదు… అలా ప్రపంచం అన్నది నీ ఊహే కనుక నీ ఊహే ప్రపంచమని తెలుసుకో” - ఆర్థర్ షోపెన్ హావర్. గెలవాలనే ప్రయత్నాన్ని ఆపేయడమే అత్యంత మహా వైఫల్యం.