Book Description
‘‘జ్యోతీ! ఇప్పటికయినా ఆవేశం తగ్గించుకుని కాస్త ఆలోచించడం నేర్చుకో, కలల్లో బతకటం మాని, వాస్తవం చూడటం అలవరుచుకో. జ్యోతీ! ప్రతివారికీ కోరికలుంటాయి. ప్రతి మనిషికీ కారుల్లో తిరగాలని, డన్‍లప్స్ మీద పడుకోవాలని, మన్మథుడిలాంటి భర్తకావాలని, తన అడుగులకి మడుగులు వత్తాలనీ ప్రతి ఆడపిల్లా కోరుకుంటుంది. కాని ప్రతివాడు కుబేరుడుకాడు. ప్రతివాడికి కారులు వుండవు. కారులున్నవాడు తన మెట్టుకంటే పైమెట్టు అమ్మాయిని తెచ్చుకుంటాడు కాని, సైకిలున్న గుమాస్తా కూతుర్ని పెళ్ళాడడు. నీకు కోరికలున్నా, గుమస్తా కడుపున పుట్టినందుకు సైకిలున్న మొగుడుని అంగీకరించకతప్పదు. ఉన్నదానితో ఆనందం వెతుక్కోవాలి కాని, లేనిదానికోసం అర్రులుచాచి, నీవు బాధపడి కట్టుకున్నవాడికి నరకం చూపితే నష్టపోయేది నువ్వే! జ్యోతీ! నీ అవివేకంతో... వైవాహిక జీవితంలో మధురంగా గడపవలసిన రోజులు అన్నీ నరకం చేసుకున్నావు. అమాయకుడు, మంచివాడు అయిన సుబ్బారావు బతుకు నరకం చేశావు. కోరికలు తీర్చలేని మగాడికన్నా ప్రేమను కురిపించే మగాడు దొరికితే... చదవండి! వివాహ బంధానికి అసలైన అర్థం - కోరికలే గుర్రాలైతే.