Book Description
‘ఈశ్వర్, పద్మ... ఇలా రోజుకో విషయాన్ని బయటపెడుతున్నారు. ఫ్రూట్స్ మేమూ తింటాం అనుకోలేదా? వృద్ధాప్యంలోనే కదా ఎక్కువగా పళ్లు తినమంటారు. అయినా ఎందుకో... కొడుకు, కోడలు పళ్ళు తింటున్నప్పుడు ఎప్పుడూ కూడా తనకు ఇవ్వలేదు. మనసు చివుక్కుమనిపించింది. ఇండియాలో పళ్ళు కొంటే పనిమనిషికి కనీసం రెండు పళ్ళయినా ఇచ్చేది. అయితే ఇక్కడ ఏవి తినాలో, ఏవి తినకూడదో తెలుసుకొని మసులుకోవాలన్నమాట! కాని వృద్ధాప్యంలో వున్న తల్లిదండ్రులు ఫ్రూట్స్ తింటారనుకోలేదని కొడుకు అనుకోవడం... బాధగా కాదు ఆశ్చర్యంగా వుంది. ‘ఏవండీ! ఆ పళ్లు ఆర్గనిక్‍వి... చాలా ఖరీదు. ముట్టుకోకండి’ అని భర్తతో ఎలా చెప్పగలదు? తమ అవసరాలకు తల్లిదండ్రుల్ని అమెరికాకు పిలిపించుకుంటున్న పిల్లలు... ఆ తల్లితండ్రుల అవసరాలు ఎంతవరకు తీరుస్తున్నారు? చదవండి ముమ్మిడి శ్యామలారాణిగారి ‘వృద్ధాప్యం శాపమా?...’