Vallu-2
Vallu-2
Vallu-2 by Bhuvanachandra
Bhuvanchandra
‘‘సర్వం సమృద్ధిగా వున్నా ‘కర్మ చెయ్యకా తప్పదు` కర్మఫలం అనుభవించకా తప్పదు. ఉత్తరంవారు సంపాదిస్తారు, తింటారు, ఖర్చు పెడతారు, ఇతరులకి తినిపిస్తారు కూడా. దక్షిణంలో అది చాలా తక్కువ. ఎంతసేపూ కుటుంబంకోసమో, పిల్లలూ, మనవలూ, మునిమనవలకోసమో పొదుపుచేస్తూ జీవించడం తప్ప. ఎంత సంపాదించినా తమ ఆనందం కోసం ఖర్చుపెట్టుకోరు’’ తేల్చేశాడు సాధూ మహారాజ్. కురుక్షేత్రపు చుట్టుపక్కల నగరాల్ని చూసినప్పుడూ, ప్రజల జీవన విధానాన్ని గమనించినప్పుడూ నాకూ అదే అనిపించింది. ‘నీకోసం నువ్వు’ ` ఫస్ట్ ప్రిఫరెన్స్. నీవాళ్ళకోసం నువ్వు’ ` సెకండ్ ప్రిఫరెన్స్ ` ఇది నార్త్ అయితే. ‘నావాళ్ళకోసం నేను’ ` ఫస్ట్ ప్రిఫరెన్స్. ‘నా తరువాత తరాల భవిష్యత్తుకోసం నేను’ ` సెకండ్ ప్రిఫరెన్స్ ‘నాకోసం నేను’ ` ఇది థర్డ్ ప్రిఫరెన్స్ ` ఇది సౌత్. కాలం కొన్ని మార్పులను తెస్తుంది. ప్రతి యుగానికీ తనదైన ధర్మమూ వుంటుంది. కాలాన్ని బట్టి న్యాయమూ మారుతుంది, ధర్మమూ మారుతుంది. మారనిది ‘సత్యం’ ఒక్కటే. అది కాలానికి అతీతమైనది.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store