Thrilling Chilling Kathalu
Thrilling Chilling Kathalu
Thrilling Chilling Kathalu by Kasturi Muralikrishna
ఈ సంకలనంలోని 65 కథలూ హారర్ కథారచన పక్రియలోని భిన్నమైన రకాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. వీటిలో కొన్ని సైన్స్ ఫిక్షన్ హారర్ కథలు అయితే మరికొన్ని పారా నార్మల్ కథలు. దయ్యాలు, భూతాలు, మాయామంత్రాల కథలున్నాయి. గోటెస్క్ హారర్ కథలున్నాయి. సర్వైవల్ హారర్ కథలున్నాయి. సైకలాజికల్ హారర్ కథలు, ఫాంటాస్టిక్ హారర్ కథలు, పర్సనాలిటీ హారర్, వైర్డ్ (వఱతీ) హారర్ కథలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఒక కథ ‘నాకు దయ్యం కావాలి’ ఆస్కార్వైల్డ్ స్ఫూర్తితో రాసిన ‘హారర్ కామెడీ’ కథ. ఇందులో ఒక కథ ‘నడిసంద్రంలో నావ...’ లో రోహిణీ శకట భేదనం అనే జ్యోతిష సిద్ధాంతాన్ని, ‘బగలముఖి’ అనే తంత్ర ప్రయోగాన్ని కలిపి ‘థ్రిల్లింగ్’ కధను సృజించాను. అలాగే, రచయితల ఆధారంగా ‘అంతు చూసిన అక్షరాలు’ అనే ఫాంటాస్టిక్ హారర్, ‘ఘోస్ట్ రైటర్’ అనే వీర్డ్ హారర్ కథలను సృజించాను. పాశ్చాత్యుల హారర్ కథలలో ప్రాధాన్యం వహించే వేర్వుల్ఫ్ కథలు (మనుషులు తోడేళ్లలా మారే కథలు) వీలయినంత విభిన్నంగా విచిత్ర జంతువును సృజించాను. ఈ రకంగా వీలయినన్ని హారర్ కథలను, వీలయినంత విభిన్నంగా ఇష్టంగా సృజించి పాఠకులన అలరించాలని ప్రయత్నించాను. ప్రచురితమవుతున్న సమయంలో పాఠకులనుంచి అందిన ప్రతిస్పందన నా ప్రయత్నం సఫలమని నిరూపించింది
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store