Swarna Gopuram

Swarna Gopuram

Sale price  Rs. 125.00 Regular price  Rs. 140.00
Skip to product information
Swarna Gopuram

Swarna Gopuram

Sale price  Rs. 125.00 Regular price  Rs. 140.00

 Swarna Gopuram by madhu babu

మధుబాబుగా ప్రసిద్ధుడైన వల్లూరు మధుసూదన రావు ప్రముఖ తెలుగు నవలా రచయిత. ఎక్కువగా పరిశోధనాత్మక (డిటెక్టివ్) నవలలు ప్రచురించాడు. వీరి చాలా నవలలో షాడో కథానాయకుడిగా కనిపిస్తాడు. కొన్ని నవలలలో వాత్సవ్ని కూడా కథానాయకుడిగా చేసి రాస్తూ ఉంటారు. ఈయన రచనా శైలిలో ఒక ప్రత్యేకత ఉన్నది, ఏ విషయాన్ని రచయతగా చెప్పారు. దానిని కథ లోని పాత్రలు మాట్లాడుకునేటట్లు చేస్తారు. ఈయన వ్రాసిన జానపద నవలలు కూడా ఇంతే స్థాయిలో చదువరులను ఆకట్టుకున్నాయి. విజయవాడకు దగ్గరున్న హనుమాన్ జంక్షన్కు చెందిన ఈయన 100కి పైగా నవలలను ప్రచురించాడు. ఈయన నవలలు ప్రాచుర్యము పొందడానికి పాత్రలలోని మానవీయత, హాస్యమేనని పాఠకులు భావిస్తారు. ప్రారంభదశలో మధుబాబు నవలలు మద్రాసులోని ఎం.వీ.ఎస్ పబ్లికేషన్స్ ప్రచురించింది. ఆ తరువాత ఈయన మధుబాబు పబ్లికేషన్స్ పేరుతో సొంత ప్రచురణాలయము ప్రారంభించారు. మధుబాబు నవలలు స్వాతి వార పత్రికలో చాలా సంవత్సరాలు వారం వారం ధారావాహికగా ప్రచురించబడ్డాయి. ప్రస్తుతం ఆంధ్రజ్యోతి వారి నవ్య వీక్లీలో మధుబాబు నవలలు ధారావాహికలుగా ప్రచురించబడుతున్నాయి. మధుబాబు చాలా కాలం వరకు కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లో ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేసి ఈమధ్యనే పదవీ విరమణ చేసారు. మెర్కురి ఎంటర్టైన్మెంట్ అనే చలన చిత్ర నిర్మాణ సంస్థకి ఒక కథను సమకూర్చారు. ఈయన పేరుకున్న ప్రాముఖ్యత దృష్ట్యా మధుబాబును అనుకరిస్తూ మధురబాబు, శ్రీ మధుబాబు వంటి రచయితలు వెలశారు.

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store

You may also like