Sankarrao Pelli
Sankarrao Pelli BY Potturi Vijaya Lakshmi
పంచపాండవుల వంటి ఆ స్నేహబృందంలో శంకర్రావు పెళ్ళి ప్రయత్నాలు మొదలయ్యాయి. మనిషి బాగానే వుంటాడు. ఇంద్రభవనంలాంటి ఇల్లుంది. లక్షణమైన ఉద్యోగం వుంది. బోలెడు సంబంధాలు వచ్చాయి. అన్నీ పరిశీలించి చూసి చివరికి ఒక అమ్మాయిని పెళ్ళిచూపులు చూడ్డానికి అంగీకరించాడు శంకరం. ఆ అమ్మాయిది తుని దగ్గర పల్లెటూరు. వాళ్ళ బంధువులెవరో హైదరాబాదులో వుంటే అక్కడికి తీసుకొచ్చి పెళ్ళిచూపులు ఏర్పాటు చేశారు. నిర్ణీత సమయానికి స్నేహబృందంతో, వారి భార్యలతో పెళ్ళిచూపులకి వెళ్ళాడు శంకరం. బాగా మర్యాదలు చేశారు. కడుపునిండా ఫలహారాలు పెట్టారు. ఆ తరువాత అమ్మాయిని చూపించారు. అమ్మాయి పేరు గౌరి. అపురూప సౌందర్యవతి కాదుగానీ ఏ వంకాలేదు. ఎక్కువ చదువుకోలేదు. పి.యు.సి. పాసయింది. కుట్లూ అల్లికలూ, వటా వార్పూ, పనీపాటా వచ్చు. పొందికగా, అందంగా వున్న ఆ అమ్మాయి తొలిచూపులోనే శంకరాన్ని ఆకర్షించింది. అక్కడనుంచి అంతా శంకరం ఇంటికి వచ్చారు. తన అభిప్రాయం చెప్పాడు శంకరం. పెళ్ళి నాలుగురోజుల్లోకి వచ్చేసింది. పెళ్ళివారిల్లు పెళ్ళికళతో కళకళాడిపోసాగింది. ఇక చదవండి.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store