Saamudrika Vaijayanthi
Saamudrika Vaijayanthi by Senapathi Dathacharya
సాముద్రిక వైజయంతి సేనాపతి దత్తాచార్య
'అయం మే హస్తః భగవాన్ అయం, అయం మే భగవత్తరః' అన్న భావన ఋగ్వేదీయం. 'అరచేతిలో వైకుంఠం' అని అధిక్షేపక లోకోక్తి. ఏది ఏమైనా మన జీవితమంతా అరచేతిలోనే ఉంది. అది అరచేయి ఎలా అయింది? సగం చేయి కాదు కదా! ఆలోచనీయమే. ఆ అరచేయే పూర్తి జీవితాన్ని తన గుప్పిట పెట్టుకోవడం ఆశ్చర్యకరం. అది విప్పి చెపుతాననడం శాస్త్రీయం. ఆ శాస్త్రాన్ని శాస్త్రీయ ధోరణిలో ఆకళింపు చేసుకున్న ఘనులు శ్రీమాన్ సేనాపతి దత్తాచార్యగారు. వీరెందరికో ఈ విద్యలో నైపుణ్యాన్ని అందించారు. మరెందరికో జీవన మార్గంలో మార్గాన్ని చూపించారు.
సాముద్రికం జాతక శాస్త్రం కంటే కూడా సరళమైనది, సరసమైనది మరియు సులభ గ్రాహ్యమైనది. జ్యోతిషంలో జనన ఘడియలు సరిగా లభ్యమైతేనే సరియైన ఫలితాలు చెప్పగలుగుతారు. కాని సాముద్రికంలో రేఖల ఆధారంగా అన్ని చెప్పవచ్చు.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store