Rhyming Dictionary in Telugu అంత్యాను ప్రాస నిఘంటువు

Rhyming Dictionary in Telugu అంత్యాను ప్రాస నిఘంటువు

Sale price  Rs. 560.00 Regular price  Rs. 600.00
Skip to product information
Rhyming Dictionary in Telugu అంత్యాను ప్రాస నిఘంటువు
1/2

Rhyming Dictionary in Telugu అంత్యాను ప్రాస నిఘంటువు

Sale price  Rs. 560.00 Regular price  Rs. 600.00

Rhyming Dictionary in Telugu by Dr. Appirala Narayanarao

అంత్యాను ప్రాస నిఘంటువు

నిత్య వ్యవహారంలో అనేక పదాలు అంత్యాను ప్రాస పదాలు అలవోకగా దొర్లుతుంటాయి, కానీ మనం వాటిని గమనించము. పూర్వకాలంలో వచ్చిన ప్రాథమిక విద్య పాఠ్య గ్రంథాలలో తల, వల, కల మొదలగు పదాలు చోటు చేసుకున్నాయి. వయోజన విద్యా పాఠ్యాంశాలలో కూడా కూడు గోడు, ఈడు జోడు మొదలగు పదాలు ఉన్నాయి. ప్రచార ప్రసార సాధనాలలో "అధిక సంతానం వద్దు ఒకరిద్దరే ముద్దు" "బ్యాంకులో ఖాతా మీ జీవితానికి జత"వంటివి. పరిణతి చెందిన రాజకీయ నాయకుల ఉపన్యాసాలలో మంచి పదాలు దొర్లుతుంటాయి. "ఢిల్లీకి రాజునైన తల్లికి బిడ్డనే" నాటి ప్రధానమంత్రి మాన్యులు పీవీ నరసింహారావు గారి మాటలివి. ముఖ్యంగా మాజీ ఉప రాష్ట్రపతి మాన్యులు ముప్పవరపు వెంకయ్య నాయుడు గారి ఉపన్యాసాలలో తెలుగు, ఇంగ్లీషు, హిందీ, భాషలలో అలవాకగా రైమింగ్ వర్డ్స్ దొర్లుతుంటాయి. ప్రాచీన ఆధునిక కవుల కలాల నుండి జాలువారిన రైమింగ్ పదాలను పంఖానుపుంఖాలుగా చెప్పుకోవచ్చు. "పొలాలన్నీ హలాల దున్ని" పదాలు కోకొల్ల లు. ఒకప్పటి సినీ గేయ రచయితలు అంత్యానుప్రాస పదాలు ఎక్కువగా వాడేవారు. "కనులు తెరిచిన నీవాయే కనులు మూసినా నీవేనాయే" మొదలైనవి అనేకం కలవు. అవధానాలు, ఆశు కవిత్వాలలో ప్రాస పదాలు అంత్యానుప్రాస పదాలు ఎక్కువగా దొర్లుతుంటాయి. - శాస్త్ర నిధి రాష్ట్రపతి పురస్కార గ్రహీత మహామహుపాధ్యాయ శృంగేరి కంచి పీఠాలకు ప్రధాన సలహాదారుడైన శ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారి అభిప్రాయం - - నరసాపురం కాలేజీలో పనిచేసే రోజుల్లో 1985 సంవత్సరంలో తెలుగు వెలుగు పేరిట జాతీయ సదస్సు నారాయణరావు నిర్వహించారు మంచి పేరు సంపాదించారు రాజమహేంద్రవరంలో ఆంధ్ర కేసరి యువజన సమితి సభ్యులుగా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది అలాగే సమితి రజితోత్సవాలు స్వర్ణోత్సవాలు అనేక కార్యక్రమాలు మిత్రులు అందరం చేసుకున్నప్పటికీ ప్రముఖమైన పాత్ర నారాయణ రావు గారిది గ్రంథాల ముద్రణ పరిరక్షణ విషయంలో ఆయన కృషి ముందుచూపుతో జరిగింది స్థానిక గౌతమి ప్రాంతీయ గ్రంథాలయంలో గల అనేక ప్రాచీన గ్రంథాలు శిథిలావస్థకు చేరుకున్న సందర్భంలో వాటిని డిజిటైజేషన్ చేసి పరిరక్షించిన ఘనత నారాయణరావు గారికే చెందుతుంది స్వంత ద్రవ్యంతో కార్యక్రమాలు చేపట్టి మంచి ప్రాజెక్టు పూర్తి చేశారు, చేస్తున్నారు. అది సాహితీ లోకానికి చిరకాలం గొప్ప ఉపకారం చేస్తుంది. ప్రస్తుతం అంత్యానుప్రాస నిఘంటువుని సంకలనం గావించి లోకానికి అందిస్తున్నారు. ఈ గ్రంథం సాహితీ లోకానికి ఎంతో మేలు చేకూరుస్తుందని భావిస్తున్నాను. అందంగా పదప్రయోగం చేయడంలో గేయరచనలు, ప్రాచీన ఆధునిక కవిత్వం, వ్యాసరచన మొదలైన రచనా వ్యాసంగానికి మంచి తోడ్పాటు ఈ గ్రంథం వలన లభిస్తుంది. వ్యయ ప్రయాసలతో కూడిన ఈ కార్యక్రమం స్వయంగా పూర్తి చేసి లోకానికి అందించిన ఆయన కృషిని మనసారా అభినందిస్తున్నాను. ఎన్నో రకాల సాహితీ సాంస్కృతిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ జీవితాన్ని ధన్యం గావిస్తున్న మిత్రుడికి కుటుంబ సభ్యులు అందిస్తున్న సహకారం ప్రశంసనీయం. ఆయన నిర్వహించిన నరసాపురం "తెలుగు వెలుగు" రాజమహేంద్రవరంలో "ఆంధ్రకేసరి యువజన సమితి" కార్యక్రమాలు ప్రత్యేకతని సంతరించుకున్నాయి. ఇంకా ఇటువంటివి ఆయన ద్వారా జరగాలని ఆయనకి అన్ని రకాల మేలు జరగాలని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. -Dr.Aripirala Narayanarao

You may also like