Rallavamkee Kathalu
Rallavamkee Kathalu
Rallavamkee Kathalu by A Kuprin
ఒలేస్యా యీ కథ ప్రచురితం అయిన వెంటనే విమర్శకులు దీన్ని గురించి పెద్ద పట్టించుకోలేదు. ‘‘ఒలేస్యా’’ అంటే కుప్రీన్కే చాలా యిష్టం.మీరు రాసిన కథల్లో మీకు బాగానచ్చినవి యేవి అని అడిగినదానికి జవాబుగా ఆయన అన్నాడు : ‘‘రెండు వున్నాయి. ‘‘ఒలేస్యా’’, ‘‘జీవిత స్రవంతి.’’ వాటిలో జీవితం, నవ్యత్వం, పాత దానితోటి కొత్తది పోరాటం చెయ్యడం, యింతకంటే మెరుగైన, నూతనమైన దానికోసం కాంక్షించటం వున్నాయి. యీ కథల్లో, యితర కథలోకంటే నా అంతరంగం యెక్కువ ప్రతిబింబించింది.’’ మక్సీమ్ గోర్కీ యీ కథని పొగిడారు : ‘‘యీ కథ నాకు నచ్చింది, యేమంటే యౌవన భావంతో తొణికిసలాడుతుంది యిది’’ అన్నాడాయన. ‘‘యిద్దరు సాల్పెత్రియేర్ రోగులతో తాము చేసిన ప్రయోగాల గురించి డా।। షార్కో రాసిందాన్ని’’ - షార్కో జాన్ మార్టేన్ (1825-1893) - సుప్రసిద్ధ ఫ్రెంచి వైద్యుడు, న్యూరోపాథాలజిస్టు. కొంత కాలం ఆయన సాల్పెత్రియేర్ మహిళా ఆస్పత్రిలో పనిచేశాడు. ‘‘యిది యిక్కడి పీడ’’- ‘‘పిల్లి, వంటవాడు’’ అన్న పిట్టకథనుంచి. దాన్ని రష్యన్ రచయిత ఇవాన్ క్రిలోవ్ (1769-1844) రాశాడు. ‘‘ఓబెరాన్, టైటానియాల’’ - జర్మన్ సంగీతకారుడు కారల్ వెబర్ (1786-1826) ఓపెరా ‘‘ఓబెరాన్’’లో పాత్రలు. లోపల ఖాళీగా వుంది. హడావుడిగా వెళ్లిపోయేటప్పుడు వుండే కంగాళీ అంతా అక్కడ వుంది. చెత్తాచెదారం నేలమీద గుట్టలుగా పడివుంది. ఒక మూల మంచపు కొయ్య చట్రం బోసిగా వుంది. నా గుండె బరువెక్కి పోయి, కన్నీళ్లు ఉబుక్కుని వస్తూవుంటే బయటికి నడుద్దామనుకునేటంతలో కిటికీ చట్రంమీద, ఉద్దేశపూర్వకంగా వేలాడదీసిన ఒక ప్రకాశవంతమైన వస్తువు నా కళ్లబడింది. పొలేస్యే ‘‘పగడాలు’’ అని పిలిచే చవకబారు ఎర్రని పూసలదండ అది. ఒలేస్యాని గురించీ, ఆమె మృదువైన ఉదారమైన ప్రేమని గురించీ జ్ఞాపకం పెట్టుకోవడానికి వదిలిపెట్టిన ఒకే ఒక స్మతి చిహ్నం
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store