Ontiki Yoga Manchidhega

Ontiki Yoga Manchidhega

Sale price  Rs. 50.00 Regular price  Rs. 60.00
Skip to product information
Ontiki Yoga Manchidhega
1/2

Ontiki Yoga Manchidhega

Sale price  Rs. 50.00 Regular price  Rs. 60.00

Ontiki Yoga Manchidhega S Sampath Kumar

ఒంటికి యోగా మంచిదేగా!

జీవనశైలిలో సమయపాలన గురించి పట్టించుకోక నిషేధిత ఆహార పదార్ధాలకు బానిసలమై, వ్యాయామం, క్రీడలు వంటి వాటిపై శ్రద్ధ పెట్టకుండా.. ప్రశాంతతకు దూరమైపోతున్నాం. రోగాలతో సహజీవనం చేస్తున్నాం. ఈ నేపథ్యంలో యోగాచార్య సంపత్కుమార్ శ్రీవత్సగారు ‘‘అనునిత్యం యోగా’’ గ్రంధాన్ని వెలువరించారు. మనం స్వయంగా విషయాన్ని అవగాహన చేసుకుని భారతీయతత్వాన్ని కలబోసిన యోగ విద్యను ఒంటపట్టించుకుని ప్రతిరోజు సాధన చేసుకోవడానికి వీలుగా వారంలో ఏడురోజులు ఎలా అనుసరించాలో ఈ గ్రంధంలో వివరింప యత్నించారు. యోగాపై అనేక గ్రంధాలను లోగడ ప్రకటించిన అపార అనుభవమున్న సంపత్కుమార్గారు ఇప్పుడు ఈ గ్రంధంలో బాలలు, యువతీ యువకులు, అన్ని వయసులవారు సులభంగా అర్ధం చేసుకుని సాధన చేసుకోవడానికి యోగ్యంగా అంశాలను పొందుపరిచారు. ప్రతీ ఒక్కరూ ఆచరించదగిన ఆసనాలను, కొన్ని ప్రాణాయామాలను ఒకటికి రెండు ‘‘ధ్యాన’’ విధానాలతో జతచేసి రోజువారీ ప్రణాళికను మనముందుంచారు. ప్రతీదినం వారంలో ఏ రోజు ఏం చేయాలి? అన్న అంశాలను సులభమైన రీతిలో ఆసనాలను ఈ గ్రంధంలో పొందుపరిచారు. వివిధ ఆసనాలు సాధన చేసేటప్పుడు దృష్టి పెట్టాల్సిన విషయాలను స్పష్టపరిచారు. ఆయా ఆసనాల ప్రత్యేకతల్ని ఈ గ్రంధంలో విడమరిచి చెప్పారు. అన్నింటికిమించి సాధారణంగా ఆయా ఆసనాలు వేస్తున్నప్పుడు సహజంగా చేసే పొరపాట్లను గుర్తుచేశారు. ఆసనాలు ఎవరెవరు వేయకూడదో తెలుపుతూ వివిధ ఆసనాల లాభనష్టానలు రేఖామాత్రంగా ఈ గ్రంధంలో వివరించారు. ఆయా ఆసనాల విధానాన్ని అందరికీ అర్ధమయ్యే రీతిలో రచన కొనసాగించారు. సోమవారం నుండి ఆదివారం దాకా సులువైన ఆసనాదులతో ప్రణాళిక రచించడంలో సంపత్కుమార్ గారు చూపిన శ్రద్ధ అభినందనీయం! ఆసనాల సాధనతోపాటు ప్రతీరోజు కొన్ని వక్రాలు, వ్యాధులు మరియు ఆహార విహారాదులను ప్రస్థావించారు. ఏడురోజుల్లో నలభై ఆసనాలు - ఏడు ప్రాణాయామాలు, ధ్యానం, రిలాగ్జేషన్ టెక్నిక్స్తో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగ్యంగా ఈ గ్రంధాన్ని తీర్చిదిద్దారు.

You may also like