Olga Nunchi Gangaku
Olga Nunchi Gangaku
Olga Nunchi Gangaku by Rahul Sankrutyayan
రాహుల్ సాంకృత్యాయన్ అంతర్జాతీయ విఖ్యాతి పొందిన పాళీ, సంస్కృత భాషా పండితుడు. గొప్ప చరిత్రకారుడు, కార్యశూరుడు, సుమారు 10 సం॥ సుదీర్ఘ కాలాన్ని స్వాతంత్ర్య యోధులుగా కారాగారాల్లో గడిపిన త్యాగమూర్తి లెనిన్డ్ విశ్వవిద్యాలయంలో ప్రాచ్యభాషా బోధకుడుగా పనిచేసి ఖ్యాతినొందిన సుప్రసిద్ధ భారతీయుడు. హిందూ సన్యాసిగను, ఆర్యసమాజకునిగను, అంతర్జాతీయ ఖ్యాతి గడించిన బౌద్ధభిక్షువుగను ఈయన పేరు పొందారు.
వీరు చేసిన భాషాసేవకు కాశీ పండితులు వీరిని "మహాపండిత్" బిరుడుతో గౌరవించారు. బౌద్ధవేదముల మూడింటిలోను ఈయన విధి. అందువల్ల బౌద్ధ విజ్ఞానులు ఈయనకు "త్రిపీడకాచార్య" నిచ్చారు.
రాహుల్ సాగించిన పరిశోధనలు భారత సంస్కృతిని 600 సం॥లు చరిత్రలో సుసంపన్నం చేశాయి. వీరి రచనలు హిందీ భాషకు 400 సం॥ల చరిత్రను చేర్చాయి. వాటిలో హెచ్చువాటిని జైళ్ళలోను లేక నేపాల్, డిబెట్, సిలోన్లలో రచించారు. వివిధ భాషలలో వీరి గ్రంథాలు 60 కి పైగా వుంటాయి.
తెలుగు పాఠకులకు సుపరిచితమైన "ఓల్గా నుంచి గంగకు" రచనను 1941 సం॥లో నిర్బంధవాసంలో రాశారు.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store