Kondagaali Kotha Jeevitham Armenian Kathalu
Kondagaali Kotha Jeevitham Armenian Kathalu
Konda Gaali Kottha Jeevitham Armenian Kathalu Nidamarthi Umarajeshwar Rao,Keshav Gopal
కొండ గాలీ కొత్త జీవితం ఆర్మీనియన్ కథలు
ఏదైనా ఒక జాతిని అర్థం చేసుకోడానికి ఒక్క మనిషితో మాట్లాడితే సరిపోతుందా అని మిమ్మల్నెవరైనా ప్రశ్నిస్తే, ఆ మనిషి ఎవరన్న దానిపైన అది ఆధారపడి వుంటుందని బహుశా మీరు జవాబు చెప్తారు.
ఈ పుస్తకంలో సమకాలీన ఆర్మీనియస్ రచయితలు తొమ్మండుగురు మీతో మాట్లాడుతారు. వారు విభిన్న తరాలకు చెందినవారు, విభిన్న జీవితాలు గడిపిన వారు, విభిన్న రచనా శైలులను అనుసరించినవారు. వారి కథల్లోని పాత్రలు ఎంతో వైవిధ్యం కలిగినవి. ఈ రచయితలు తమ రచనల్లో తమ పరిసర ప్రపంచాన్ని కవితా దృష్టితోనో, లేక నాటకీయ దృష్టితోనో దర్శిస్తారు, పరిహాస దృష్టితోనో, లేక ప్రగాఢమైన మానసిక విశ్లేషణ దృష్టితోనో చూస్తారు.
ఇవిగో మీ ముందు తొమ్మండుగురు రచయితలు రాసిన తొమ్మిది కథలున్నాయి. అవన్నీ కూడా పురాతన సంస్క•తి కలిగి, ప్రస్తుతం తమకు తాము సుఖమయమైన కొత్త జీవితాన్ని నిర్మించుకొంటున్న ఆర్మీనియన్ల చక్కని స్వభావాన్ని గురించీ, ధైర్యసాహసాలను గురించీ, సాత్విక లక్షణాన్ని గురించీ చిత్రిస్తాయి
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store