Kodi Rammurthy Naidu

Kodi Rammurthy Naidu

Sale price  Rs. 260.00 Regular price  Rs. 275.00
Skip to product information
Kodi Rammurthy Naidu
1/2

Kodi Rammurthy Naidu

Sale price  Rs. 260.00 Regular price  Rs. 275.00

Kodi Rammurthy Naidu Yarnagula Sudhakar Rao

కోడి రామ్మూర్తినాయుడు యర్నాగుల సుధాకరరావు

“The Indian Hercules- Kalyug ka Bhim”

ఓ సాయింత్రం మావూరి రైల్వేస్టేషన్ ప్లాట్ఫారమ్ చివర 80ఏళ్ల ఓ పెద్దాయన నన్ను పిలిచి సిమ్మెంట్ బెంచిపై తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. ఆయన పేరు పిడుగు కాళిదాస్ అని చెప్పి చేతిలో పాకెట్ డిటెక్టివ్ నవలలు చూపాడు. ‘‘ఇవన్నీ నీవు రాసినవేనట. అద్దెకొట్లో తెచ్చి చదివేసాను. నీవు రాసే విధానం నాకు నచ్చింది. పైగా, కుర్రాడివి. నేనో పుస్తకం రాయమని కోరితే రాస్తావని నమ్ముతూ ఇలా పిలిచి మాటలు కలిపాను’’ అని చెప్పాడు. ఆ పెద్దాయన రోగాలు, రొష్టులు లేని వాడిలా బలంగా ఉన్నాడు. రాయమన్న బుక్కు గురించి చెప్పమన్నాను. ఒరియా భాషలో వెలువడ్డ కోడిరామమూర్తి చరిత్ర పాతిక పేజీల బుక్కు పదేపదే చదివాను. ఆ యోధుడు మన తెలుగువాడే. మహా బలశాలి. ఎందరో పహిల్వాన్లను కుస్తీపోటీల్లో మట్టి కరిపించాడు. ఓ సర్కస్ కంపెనీ నడిపి పలుదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చాడు. చివరాఖరిలో బలంగీర్,కలహండి సంస్థానాధీశుల ప్రాపకంలో సాదాసీదాగా గడిపేసాడు. అతడి జీవిత చరిత్ర తెలుగులో ఎవరు రాయలేదు. ఏ ఒక్క ప్రచురణ సంస్థ అచ్చేయలేదు. పుంఖాను పుంఖాలుగా పత్రికల్లో వ్యాసరూపాల్లో వచ్చాయి. అలాంటి మన జిల్లా యోధుడు చరిత్ర మరుగున పడింది. అతడు తెలగజాతిలో పుట్టడమే మరుగున పడ్డాడు. ఈ జాతి శాపగ్రస్థమైనది కనుక ఎదుగుబొదుగు 
ఉండదు.
మనకు తెలియకుండానే మరుగునపడిపోయిన గొప్ప మహానుభావుడ్ని గురించి తెలుగులో మొట్టమొదటిసారిగా ప్రచురించటం జరిగింది. చదివి, తెలుసుకోండి

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store

You may also like