Jeevinchu Nerchuko Andhinchu

Jeevinchu Nerchuko Andhinchu

Sale price  Rs. 150.00 Regular price  Rs. 250.00
Skip to product information
Jeevinchu Nerchuko Andhinchu
1/2

Jeevinchu Nerchuko Andhinchu

Sale price  Rs. 150.00 Regular price  Rs. 250.00

Jeevinchu Nerchuko Andhinchu by T.Raghothama Reddy

శరీరమాద్యం ఖలు ధర్మసాధనం’ అనే కొటేషన్ (సూక్తి) మా ఇంటి దూలం పక్కన చాక్పీసుతో రాసి ఉండటాన్ని నేను చదివాను. అప్పడు నా వయసు ఏడు సంవత్సరాలు కావచ్చు. నేను రెండో తరగతిలో ఉండి ఉండవచ్చు. రాసిన వారెవరో ఆ కొటేషన్ రచయిత పేరు రాయలేదు. భూమిలో పడ్డ విత్తనం తీరుగా - ఆ కొటేషన్ నా మనసులోపడ్డది అర్థమయీ కానట్టు - బోధపడీ పడనట్టు. దాని అర్థం ఏమిటో పూర్తిగా తెలుసుకోవాలనే జిజ్ఞాస నాలో ప్రారంభమైంది. దాని అర్థం గురించి నేనెవరినీ అడగలేదు. వయసుపెరుగుతున్నకొద్దీ, జీవితానుభవాలు కలుగుతున్నకొద్దీ, జీవితాన్ని గమనిస్తున్నకొద్దీ ఆ కొటేషన్ రోజూ నా కేదో బోధిస్తున్నట్టుగానే ఉండేది. శరీరం - ఆరోగ్యం - తిండి - వ్యాయామం వంటి విషయాలే కాదు, శరీరానికీ, జీవితానికీ ఉండే సంబంధం ఎటువంటిదో, అటువంటి శరీరాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో, దానికోసం ఏమి చెయ్యాలో, ఏమి చెయ్యకూడదో నిత్యం నాకేదో ఎరుక పరుస్తున్నట్టుగా ఉండేది. ఆ కొటేషన్ చిన్నదేకాని, మొత్తం జీవితం పొడుగునా నన్ను చైతన్య పరుస్తూ వస్తూనే ఉంది. అది మొదలు నాకు కనిపించిన ప్రతి కొటేషన్నీ చదువుతూ వచ్చేవాణ్ణి. నాకు సాహిత్యం పట్ల - ఆసక్తి ఆ కొటేషన్తోనే ప్రారంభమైందని చెప్పాలి.

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store

You may also like