Hamsadwani
Hamsadwani
Hamsadwani Kommanapalli Ganapathi Rao
హంసధ్వని కొమ్మనాపల్లి గణపతిరావు
జైలు గోడలు దాటి విశాల ప్రపంచంలోకి సరికొత్త ఆలోచనతో అడుగుపెట్టిన భార్గవకు, తొలిసారిగా ఎదురైంది యామిని.
ఎన్నో యుగాల అన్వేషణ ఫలించిన సంతృప్తి ఆమెకళ్ళలో...
ఏదో చేయాలన్న కృతనిశ్చయం భార్గవ మనసులో...
అనుకున్న లక్ష్యం నెరవేరేవరకూ ఆమెకు దూరంగా ఉండాలన్న ఆలోచన.
జైలు జీవితం తెచ్చిన నిర్లిప్తత.
చివరికి ఏమవుతాడో తెలియని విచిత్రస్థితి.
అలసిపోయిన జీవనయానంలో కెరటంలా పైకి దూకి విరిగి వెనక్కి వెళ్ళిపోయిన గాంధి, అలలా ఒడలును తాకి కలలా కరిగిపోయిన హసీనా, ఓటమిని గుండెలకు గాక గెలుపునకు అన్వయించుకొమ్మని ఉద్బోధించిన సంఘటనలు- మరెన్నో గుర్తులు.
నలిగిపోయిన జీవితడైరీలో కరిగిపోయిన అక్షర స్మ•తులు.
భవిష్యత్తు గురించి అతడెప్పుడో నిర్ణయించుకున్నాడు
ఈ కాలుష్య వాతావరణానికి దూరంగా మరెక్కడికో సాగిపోవాలని.
అతని పయనమెటు?
అతని గమ్యమేమిటి
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store