Geetanjali

Geetanjali

Sale price  Rs. 110.00 Regular price  Rs. 120.00
Skip to product information
Geetanjali
1/2

Geetanjali

Sale price  Rs. 110.00 Regular price  Rs. 120.00

Geetanjali P Krishnaiah

గీతాంజలి పి కృష్ణయ్య

డా. పి. కృష్ణయ్య గారు నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా వెంకన్నపురం గ్రామంలో 1952 సంవత్సరంలో జన్మించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుండి ఎకనామిక్స్లో పిహెచ్.డి పట్టా పొందారు. తొలుత యస్.వి. ఆర్ట్స్ కళాశాలలో ఉపన్యాసకునిగా పని చేసి తదుపరి 1979లో రాష్ట్ర సివిల్ సర్వీసులో ప్రవేశించారు.

డా. కృష్ణయ్య గారు గత 45 సంవత్సరాలుగా ప్రజా సేవలో వున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మహబూబ్ నగర్, చిత్తూరు జిల్లాల కలెక్టరుగా, తిరుమల తిరుపతి దేవస్థానముల కార్యనిర్వహణాధికారిగా, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి వంటి కీలక బాధ్యతలు నిర్వహించారు. చివరగా హైదరాబాదు నందలి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన జాతీయ మత్స్య అభివృద్ధి సంస్థకు ప్రధాన కార్యనిర్వాహకునిగా పని చేసి 2012లో పదవీ విరమణ చేశారు. వీరు పదవీ విరమణ అనంతరం విభజిత రాష్ట్రంలో 2014-2019 మధ్య ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల మౌలిక సదుపాయాల కల్పనా సంస్థకు అధ్యక్షునిగా పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణా సంస్థకు అధ్యక్షునిగా పని చేస్తున్నారు.

ఇదివరకు డా. కృష్ణయ్య గారు “శ్రీసూక్తులు” పేరిట ప్రసిద్ధ తమిళ గ్రంథం 'తిరుక్కురళ్'ను 2018లో తెలుగులోనికి అనువదించారు. తదుపరి 2021లో సంస్కృత భగవద్గీతను కూడా సరళమైన తెలుగులోనికి అనువదించారు. ఈ రెండు అనువాదములను ఎమెస్కో సంస్థ ప్రచురించింది.

ఇప్పుడు డా. కృష్ణయ్య గారు సాహిత్యంలో నోబెల్ ప్రైజ్ సాధించిన ఏకైక భారతీయ రచన శ్రీ రవీంద్రనాథ్ టాగూర్ గారి 'గీతాంజలి'ని తెలుగులోనికి అనువదించారు. ఇటీవలి కాలంలో వచ్చిన తెలుగు అనువాదాల్లో ఇది చాలా సరళమైనది. సాహిత్యాభిమానులకు ఈ తాజా ‘గీతాంజలి' తెలుగు అనువాదం మరొక మంచి పుస్తకం అవుతుందని మా విశ్వాసం.*

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store

You may also like