Ekkadiki Gamanam Enthadooramee Gamyam Nikhileshwar

Ekkadiki Gamanam Enthadooramee Gamyam Nikhileshwar

Sale price  Rs. 95.00 Regular price  Rs. 100.00
Skip to product information
Ekkadiki Gamanam Enthadooramee Gamyam Nikhileshwar
1/2

Ekkadiki Gamanam Enthadooramee Gamyam Nikhileshwar

Sale price  Rs. 95.00 Regular price  Rs. 100.00

Ekkadiki Gamanam Enthadooramee Gamyam Nikhileshwar

నిఖిలేశ్వర్ ‘ఎవరిదీ ప్రజాస్వామ్యం? ఏ విలువలకీ ప్రస్థానం?” అన్న తన వ్యాస సంపుటాన్ని మొదటిసారి ప్రచురించి ఇప్పటికి పాతికేళ్లయ్యింది. ఈ వ్యాస సంపుటికి ముందు దిగంబర కవిగా ఆయన ఆవిర్భవించినప్పుడు దేశంలో ఉన్న పరిస్థితులే ఆయనను దిగంబర కవిని చేశాయి. ఆ పరిస్థితులను మార్చాలనే ఉద్దేశంతోనే ఆయన విరసంలో చేరి పనిచేయడం. అయినా పరిస్థితులు చక్కబడకపోగా మరింత అణచివేత, దమనకాండ చోటు చేసుకున్నాయి.

2000 నాటికే నాడున్న ప్రజాస్వామ్యం పట్ల నిఖిలేశ్వర్లో ప్రశ్నలు రేకెత్తాయి. ఆనాడు సమాజంలో పతనమైన విలువలు సమాజాన్ని ఏవైపుకు తీసుకుపోతున్నాయన్న ప్రశ్న కూడా తలెత్తింది. మరి ఈ పాతికేళ్లలో ఆ పరిస్థితి మరింత దిగజారిందే తప్ప ఏమాత్రం మెరుగుపడలేదు. అందుకే ఇప్పుడాయన ఈ సమాజ గమనం ఎక్కడికి సాగుతూంది, దీని గమ్యం ఏమిటి? ఆ గమ్యం ఎంతదూరంలో ఉంది అన్న విషయాలను ప్రశ్నించుకుంటున్నాడు.

నేటి భారత పౌరులందరూ వేసుకోవలసిన ప్రశ్నలే ఇవి. ప్రతి మేధావి ఆలోచించవలసిన విషయాలే ఇవి. ప్రముఖ కవి, విమర్శకుడు, అనువాదకుడు నిఖిలేశ్వర్ ఈ విషయంలో తన ఆలోచనలను ఈ పాతికేళ్లలో తాను రాసిన వ్యాసాలలో చర్చించాడు. రచయితలో నేటి పరిస్థితుల పట్ల విపరీతమైన అసంతృప్తి ఉన్నప్పటికీ భవిష్యత్తులో మార్పు వస్తుందన్న ఆశ కూడా స్పష్టంగా కనిపిస్తుంది.

నేటి మన సమాజం గురించి, దేశ పరిస్థితుల గురించి, అంతర్జాతీయ వ్యవహారాల గురించి ఆలోచించే ప్రతి వ్యక్తీ చదవవలసిన పుస్తకం. ఆత్మశోధన చేసుకోవలసిన సందర్భం. *

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store

You may also like