Ee Kaalapu Telugu Katha
Ee Kaalapu Telugu Katha
Ee Kaalapu Telugu Katha BY Kunaparaju Kumar
కథల పూచెండు కథలను కూర్పుచేసే ఈపనిని కాలం ఇచ్చిన అదృష్టంగా భావిస్తాను. ఎవరో దేశం కానీ దేశంలో ఓ మాట తూలారు. ‘‘అధోగతిలోనికి తెలుగు కథ జారిపోతోందని. నేను కూడా చాలా కాలం నుండి కథలు చదువుతూనే వున్నాను. అరవై, డభై దశకాలలో తెలుగు నవీన కథకు స్వర్ణయుగం అనచ్చు. మంచి కథలు అప్పుడు వెల్లువగా వచ్చాయి. కొంతకాలం ఆ వెలుగుల తర్వాత స్తబ్దత. కమర్షియల్ కథలు, నవలల వెల్లువ, తరువాత ఏవో అడపాదడపా మెరుపులు మెరిసినా, ఓ ముప్పె సంవత్సరాలు పిల్ల తెమ్మెరలు కూడా వీయలేదు. ఆస్తిత్వవాదాల కథలు వచ్చాయి. ఓ శూన్యం తరువాత, ఓ పదిహేను సంవత్సరాల నుండే, పచ్చటి మొక్కలు మొలుస్తున్నాయి. అవి ఎప్పుడూ మనం చూడని అందమైన పూలను ఇస్తున్నాయి. మనం ఊహించిన పూలు కాదు, ఇవి కొత్త పూలు ఎప్పుడూ చూడనివి, ఎప్పుడూ ఆస్వాదించని సువాసనలు వెదజల్లుతున్నాయి. అవి అమాయకంగా కనిపిస్తున్నాయి. ఎంతో హాయిని ఇస్తున్నాయి. కానీ అవి అధోలోకంలో మగ్గుతున్న మానవ ఆకారాల, కన్నీటి బాధల ఆర్తనాదాలు చిన్నగా, సన్నగా వినిపిస్తున్నాయి. అవి ఇప్పుడు బృందగానంగా మారతాయా? ‘We shall over come some day’ అని పాడతాయా! ఇప్పుడు తెలుగు కథ మరో ప్రభంజనానికి పునాది వేసింది. ఆ వెలుగులను తప్పనిసరిగా త్వరలోనే చూస్తారు. దానికి ఈ మార్పు శుభారంభం
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store