Crime and Punishment Neramu Siksha

Crime and Punishment Neramu Siksha

Sale price  Rs. 250.00 Regular price  Rs. 280.00
Skip to product information
Crime and Punishment Neramu Siksha
1/2

Crime and Punishment Neramu Siksha

Sale price  Rs. 250.00 Regular price  Rs. 280.00

Crime and Punishment Neramu Siksha Fyodor Dostoevsky

టాల్‌స్టాయ్‌తో  కలుపుకుని రష్యన్ సాహిత్య స్వర్ణయుగం నాటి ప్రముఖ రచయితగా పేరు గాంచిన దాస్తొయెవ్స్కీ (Fyodor Dostoyevsky) చెకోవ్, హెమింగ్వే లాంటి రచయితలను నీషే, సార్త్రే లాంటి తత్వవేత్తలను విశేషంగా ప్రభావితం చేసారు. 19 వ శతాబ్దపు రష్యన్ సామాజిక, రాజకీయ, నైతిక సంఘర్షణల నేపథ్యంలో మానవ సంబంధాలు, మనస్తత్వాలు, మానసిక విశ్లేషణలతో కూడిన రచనలు చేసిన దస్తయేవస్కీ “క్రైమ్ అండ్ పనిష్మెంట్” ( Crime and Punishment ) “బ్రదర్స్ కరమొజొవ్” ( The Brothers Karamazov ) లతో ప్రపంచ ప్రసిద్ధి గాంచారు. “బ్రదర్స్ కరమొజొవ్” నవల అత్యంత విశిష్టమైన రచన అని సిగ్మండ్ ఫ్రాయిడ్ చే ప్రశింసబడింది. దస్తయేవస్కీ “Notes From Underground” ( అజ్ఞాతవాసపు యాదస్తు చీటీలు ) నవల అస్థిత్వవాద సాహిత్యపు ( Existentialist literature ) తొలినాటి రచనగా గుర్తింపు పొందింది. 20 వ శతాబ్దపు అత్యంత ప్రభావవంతమయిన, అస్థిత్వవాద శైలితో రచనలు చేసిన, ఫ్రాంజ్ కాఫ్కా దస్తయేవస్కీని తన రక్తసంబందీకుడు ( blood-relative ) అంటూ అభిమానించాడు. విశిష్టమైన మనస్తత్వవేత్త (psychologist ), తత్వవేత్త (philosopher) అయిన దస్తయేవస్కీ మానవ హృదయపు లోతుల్ని, సంక్లిష్టాలని తన రచనల్లో ప్రతిభావంతంగా చిత్రించారు. దస్తయేవస్కీ రచనలు ప్రపంచ భాషలెన్నింటిల్లోకో అనువదించబడి (170 languages) కోట్లాది కాపీలు అమ్ముడుబోయి (34 million copies from 1917 to 1981) ప్రాచుర్యం పొందాయి.

Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store

You may also like