Chillara Devullu
Chillara Devullu
Chillara Devullu BY Dasaradhi Rangacharya Rachanalu
తెలంగాణా జనజీవనం, నిజాంపాలన నాటి తదనంతర రైతాంగ పోరాటం, నాటి సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక అంశాల నేపథ్యంలో దాశరథి రంగాచార్య రూపు కట్టించినట్టు మరే రచయితా చిత్రించలేదన్నది సత్యం. చారిత్రకంగా జరిగిన సామాజిక పరిణామ దశల్లో జన శ్రేణులు ఎలా స్పందించిందీ, తమ సాంస్కృతిక స్వేచ్ఛ కోసం ఎలా నిరసన తెల్పిందీ, రాజకీయ అస్తిత్వం కోసం ఎలా ఆందోళన, తిరుగుబాటు, ప్రతిఘటనలు చేసిందీ-చివరకు భూమి కోసం, భుక్తికోసం, భాష కోసం, వెట్టిచాకిరి అంతం కోసం, నిజాం పాలనను తుదముట్టించటం కోసం ఎలా సంఘటించి పోరాడిందీ దాశరథి రంగాచార్య రచనలు నేటి తరానికి కళ్ళ ముందు కదలాడేలా చేస్తాయి.
చిల్లరదేవుళ్ళు, మాయజలతారు, మోదుగుపూలు, జనపదం వంటి నవలలు చరిత్ర నిర్మాతలు జనం అన్న సత్యాన్ని వెల్లడిస్తాయి. జనం భాషలో గుండెలను పలకరిస్తూ, మెదళ్ళను పదునుబెడ్తాయి. వీరి రచనలు అనేకం ఇతర భారతీయ భాషల్లోకి వెళ్ళాయి. చలన చిత్రాలుగా కూడా వచ్చాయి.
సంప్రదాయం పునాదుల మీద ఆకాశమంత ఎత్తుగా ఎదిగిన అభ్యుదయ సారస్వత గోపురం దాశరథి రంగాచార్య సాహిత్యం
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store