Mallikarjun Kharge-Karuna,Nyayam Sammilatha Abhivruddhitho Kudina Rajakeeya Bhaagaswamyam
Mallikarjun Kharge-Karuna,Nyayam Sammilatha Abhivruddhitho Kudina Rajakeeya Bhaagaswamyam
Mallikarjun Kharge Sukhadeo Thorat | Chetan Shinde (eds)
Mallikarjun Kharge-Karuna,Nyayam Sammilatha Abhivruddhitho Kudina Rajakeeya Bhaagaswamyam
MALLIKARJUN KHARGE: Political Engagement with Compassion, Justice, and Inclusive Development
సుఖదేవ్ థోరాట్, చేతన్ షిండేలు శ్రీ మల్లికార్జున ఖర్గే జీవితం, బహుముఖ వ్యక్తిత్వం గురించి ఈ పుస్తకంలో అద్భుతంగా వివరించారు. ఆయన జీవితం నిరుపేదగా ప్రారంభమయింది, కులవివక్షను ఎదుర్కొన్నారు. తన కెదురైన అవరోధాలనన్నింటినీ అధిగమించి ఆయన జాతీయస్థాయి నాయకుడయ్యారు. రాష్ట్రంలో, కేంద్రంలో మంత్రిగా పనిచేశారు. ప్రతిపక్ష నాయకుడయ్యారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులయ్యారు. అన్ని రాజకీయ పక్షాల నాయకుల గౌరవాన్ని పొందారు. అట్టడుగు స్థాయి నుండి నిబద్ధత కలిగిన నాయకులు జాతీయస్థాయికి ఎదిగి వచ్చే ‘రాజకీయాల నమూనా’ ను ఈ పుస్తకం మన కందిస్తున్నది.
డా. సుధా పాయ్, పూర్వ ఆచార్యులు, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, నూఢిల్లీ, దళిత రాజకీయోద్యమంపై నిపుణులు
సమత్వ, రాజ్యాంగ ప్రజాస్వామ్యం పట్ల నిబద్ధత కలిగిన ఒక గొప్ప నాయకుడి జీవిత విశ్లేషణ ఈ గ్రంథం. కుల, వర్గ, సమాజ, ప్రాంతపరంగా, ఆర్థికంగా వంచితులవుతున్న బహుళ సంఖ్యాక ప్రజల గొంతు శ్రీ ఖర్గే. శ్రీ మల్లికార్జున ఖర్గేకి ఆదర్శం బుద్ధుడు, బసవేశ్వరుడు, అంబేద్కర్ సిద్ధాంతాలు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు శ్రీ ఖర్గే జీవితాన్ని, ఆయన సాఫల్యాలను ఈ గ్రంథం ద్వారా మన ముందుంచుతున్నారు.
- వలేరియన్ రోడ్రిక్స్, పూర్వ ఆచార్యులు, మంగళూరు విశ్వవిద్యాలయం, కర్ణాటక; జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, నూఢిల్లీ; సీనియర్ ఫెలో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్, సిమ్లా
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store