{"product_id":"khalil-gibran-desa-dimmari-picchivadu-margadarsi-దేశ-ద్రిమ్మరి-పిచ్చివాడు-మార్గదర్శి","title":"Khalil Gibran","description":"\u003cp\u003eKhalil Gibran  by Guntur Hema Sundareddy\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eనేను, అతన్ని నాలుగు రోడ్ల కూడలిలో కలుసుకున్నాను; అతని దగ్గర ఒక దుప్పటి, చేతి కర్ర మాత్రమే ఉన్నాయి. అతని ముఖం బాధ అనే ముసుగుతో కప్పబడి ఉంది. మేము ఒకరినొకరం పలకరించుకున్నాం. నేను అన్నాను, అతడితో, \"నా ఇంటికి రండి, నా అతిథిగా ఉండండి.”\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eమరి, అతను వచ్చాడు.\u003cbr\u003e\u003c\/span\u003e\u003cspan\u003eనా భార్య, పిల్లలు వాకిట్లోనే మమ్మల్ని కలుసుకున్నారు. అతను వారిని చూసి, చిరునవ్వు నవ్వాడు. వారు అతని రాకను అభిమానించారు.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eతరువాత, మేమందరం కలిసి, బల్ల దగ్గర కూర్చున్నాం. అతనితో మేము సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే, అతనిలో ఒక నిశ్శబ్దం, ఒక రహస్యం లాంటిది \u003c\/span\u003e\u003cspan\u003eఉంది.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eరాత్రి భోజనం తర్వాత, మేము నెగడు దగ్గర చేరాం. నేను అతని సంచారాలను గూర్చి అడిగాను.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eఅతను మాకు అనేక కథలు చెప్పాడు, ఆరాత్రి, మరుసటి రోజు కూడా. కాని, నేను చెప్పబోయే విషయాలు ఆయన కష్టదినాలను గురించినవే, కాని అతను మాత్రం దయతో ఉన్నాడు. ఈ కథలు, ఆయన దుమ్ములో, ఓర్పుతో రోడ్డుమీద తిరిగిన \u003c\/span\u003e\u003cspan\u003eసంగతులే.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eతరువాత, మూడురోజులకి అతను మమ్మల్ని వదిలి వెళ్లాడు. కాని మేము భావించలేదు, ఒక అతిథి వెళ్లిపోయాడని, మాలో ఒకరు బయట తోటలోనే ఉన్నారని, ఇంకా ఇంట్లోకి రాలేదని అనుకుంటున్నాం...............\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu  Books- a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663890956544,"sku":"WS-QLYS-9R8T","price":100.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Khalil_Gibran.jpg?v=1780309722","url":"https:\/\/www.sahithibooks.com\/products\/khalil-gibran-desa-dimmari-picchivadu-margadarsi-%e0%b0%a6%e0%b1%87%e0%b0%b6-%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%aa%e0%b0%bf%e0%b0%9a%e0%b1%8d%e0%b0%9a%e0%b0%bf%e0%b0%b5%e0%b0%be%e0%b0%a1%e0%b1%81-%e0%b0%ae%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%97%e0%b0%a6%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b6%e0%b0%bf","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}