{"product_id":"jeevinchu-nerchuko-andhinchu","title":"Jeevinchu Nerchuko Andhinchu","description":"\u003cp\u003eJeevinchu Nerchuko Andhinchu by T.Raghothama Reddy\u003c\/p\u003e\n\u003cp\u003eశరీరమాద్యం ఖలు ధర్మసాధనం’ అనే కొటేషన్ (సూక్తి) మా ఇంటి దూలం పక్కన చాక్పీసుతో రాసి ఉండటాన్ని నేను చదివాను. అప్పడు నా వయసు ఏడు సంవత్సరాలు కావచ్చు. నేను రెండో తరగతిలో ఉండి ఉండవచ్చు. రాసిన వారెవరో ఆ కొటేషన్ రచయిత పేరు రాయలేదు. భూమిలో పడ్డ విత్తనం తీరుగా - ఆ కొటేషన్ నా మనసులోపడ్డది అర్థమయీ కానట్టు - బోధపడీ పడనట్టు. దాని అర్థం ఏమిటో పూర్తిగా తెలుసుకోవాలనే జిజ్ఞాస నాలో ప్రారంభమైంది. దాని అర్థం గురించి నేనెవరినీ అడగలేదు. వయసుపెరుగుతున్నకొద్దీ, జీవితానుభవాలు కలుగుతున్నకొద్దీ, జీవితాన్ని గమనిస్తున్నకొద్దీ ఆ కొటేషన్ రోజూ నా కేదో బోధిస్తున్నట్టుగానే ఉండేది. శరీరం - ఆరోగ్యం - తిండి - వ్యాయామం వంటి విషయాలే కాదు, శరీరానికీ, జీవితానికీ ఉండే సంబంధం ఎటువంటిదో, అటువంటి శరీరాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో, దానికోసం ఏమి చెయ్యాలో, ఏమి చెయ్యకూడదో నిత్యం నాకేదో ఎరుక పరుస్తున్నట్టుగా ఉండేది. ఆ కొటేషన్ చిన్నదేకాని, మొత్తం జీవితం పొడుగునా నన్ను చైతన్య పరుస్తూ వస్తూనే ఉంది. అది మొదలు నాకు కనిపించిన ప్రతి కొటేషన్నీ చదువుతూ వచ్చేవాణ్ణి. నాకు సాహిత్యం పట్ల - ఆసక్తి ఆ కొటేషన్తోనే ప్రారంభమైందని చెప్పాలి.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":48891969798400,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/jeevinchunerchukoandhinchu_telugubookstore.jpg?v=1782477044","url":"https:\/\/www.sahithibooks.com\/products\/jeevinchu-nerchuko-andhinchu","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}