{"product_id":"baanisalu-bhagavaanuvaacha-kesava-reddy","title":"BAANISALU -BHAGAVAANUVAACHA","description":"\u003cp\u003e\u003cspan\u003eBAANISALU -BHAGAVAANUVAACHA by DR KESAVA REDDY\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eకేశవరెడ్డి గారి రెండు నవలికలు బానిసలు-భగవానువాద 'భారతి'లో వెలువడ్డాయి.\u003c\/p\u003e\n\u003cp\u003eఅగ్రహారానికి, హరిజనవాడకు మధ్య రెండు ఊళ్ళను కలుపుతూ రోడ్డు వేయాలని సంకల్పిస్తారు. హరిజనులందరూ శ్రమదానంతో మట్టిరోడ్డు వేస్తే, అగ్రహారీకులు రూ.600లతో దానికి కంకర వేయాలని ఒప్పందం, మునసబు గారి గొలుసు కనిపించకుండా పోతుంది. దాన్ని అక్కడున్న కూలీలెవరో కాజేసి వుంటారని ఆయన అనుమానం. దాంతో ఆయన హరిజన పెద్దపైన చేయి చేసుకుంటాడు. అక్కడున్న హరిజనులందరినీ గుడికి వచ్చి ప్రమాణం చేయవలసిందిగా అజ్ఞాపిస్తాడు. ఆయన దౌష్టాన్ని ఎదిరించి అందుకు ఒప్పుకోనివాడు సుబ్బారాయుడు అనే హరిజనుడు. అందువల్ల రోడ్డు పని ఆగిపోతుంది.\u003c\/p\u003e\n\u003cp\u003eనాగరికత శరవేగంతో మారుతూ వుంది. మనుషుల వేషభాషలు మారుతున్నాయి. కట్టుబాట్లు మారుతున్నాయి. ఆచార, సంప్రదాయాలు మారుతున్నాయి. కానీ హరిజనుల వ్యవస్థకు సంబంధించినంత వరకూ కాలచక్రం ఆగిపోయినట్లు అనిపిస్తుంది. అందుకు కారణమేమిటనేది బానిసలు నవలలో రచయిత కేశవరెడ్డి గారి విచికిత్స.\u003c\/p\u003e\n\u003cp\u003eఅతని రెండవ చడని భగవానువాడ ఒక బడిపంతులు కథ. పదవీ విరమణ పొందిన రామదాసు కూతురి పెళ్ళికోసం తాను బ్యాంక్లో దాచుకున్న కష్టార్జితం నాలుగువేల రూపాయలు 'ఐతే' చేస్తాడు. పొద్దుపోయి చీకటిపడిన తర్వాత అతడు పట్నానికి నలభై మైళ్ళ దూరంలో వున్న స్వగ్రామానికి ఓ లారీలో పయనించవలసి వస్తుంది. ఆ లారీ డ్రైవరు సాధారణ పరిస్థితుల్లో మంచివాడే! కానీ ఒంటరిగా, నిస్సహాయంగా వున్న ఎదుటి మనిషి, జేబునిండా డబ్బు కనిపించడం అసాధారణ పరిస్థితి గదా! డ్రైవరులోని రాక్షసుడు ఒళ్ళు విరుచుకుంటూ నిద్ర లేచేస్తాడు. దానవత్వం మానవతను గొంతు పిసికి చంపేయడానికి పుంకిస్తున్న క్షణంలో రామదాసుకు గీతోపదేశం జ్ఞప్తికి వస్తుంది. అతను 'భగవానువాచను అక్షరాలా పాటిస్తాడు.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"VISALAANDHRA PUBLISHING HOUSE","offers":[{"title":"Default Title","offer_id":48164689084672,"sku":null,"price":90.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/BAANISALU_-BHAGAVAANUVAACHA_telugu_book.jpg?v=1773470016","url":"https:\/\/www.sahithibooks.com\/products\/baanisalu-bhagavaanuvaacha-kesava-reddy","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}