{"product_id":"anuraga-ganga-yaddanapudi-sulochanarani","title":"Anuraga Ganga Yaddanapudi Sulochanarani","description":"\u003cp\u003eAnuraga Ganga BY Yaddanapudi Sulochanarani\u003c\/p\u003e\n\u003cp\u003eఅనురాగ గంగ - యద్దనపూడి సులోచనా రాణి\u003c\/p\u003e\n\u003cp\u003eఅందమైన పాలరాతి బొమ్మకి ప్రాణం వచ్చినట్టుగా,పాలనురగ లాంటి తెల్లటి దుస్తులతో,మెల్లగా మెట్లు దిగివస్తున్న ప్రీతి చేతిలో నవనవలాడుతున్న పసుపుపచ్చటి గులాబి పువ్వు ఉంది. క్రింది హాలులో పార్టీకి వచ్చిన ఆహుతులందరి కళ్ళూ ఆ అమ్మాయి మీదనే నిల్చినా, తన కళ్ళుమాత్రం ఎవరికోసమో వెతుకుతున్నట్టుగా చూస్తున్నాయి.\u003c\/p\u003e\n\u003cp\u003eప్రీతి పాదం ఆఖరి మెట్టు మీదకు రాగానే శరత్ చంద్ర అక్కడికి వచ్చాడు. ప్రీతి క్షణం సేపు తదేకంగా అతన్ని చూసింది. ఆ తర్వాత చేతిలో గులాబి అతనికి అందిస్తూ తగ్గు స్వరంతో “మీ ఉత్తరానికి జవాబు ఇదే!”అంది. మగసిరి నిండిన అతని చేతివేళ్ళు ఆపువ్వుని అందుకున్నాయి.”థ్యాంక్ యూ”అతను అస్పష్టంగా అన్నాడు. ప్రీతి ఆ పువ్వుని వదల లేదు. అతనివైపే చూస్తోంది. అతను కూడా ప్రీతి వైపే చూస్తున్నాడు.\u003c\/p\u003e\n\u003cp\u003eదూరం నుంచి ఒక వయససుమళ్ళిన వ్యక్తి వీళ్ళిద్దరినీ రెప్పవాల్చకుండా చూస్తున్నాడు.అతని ముఖంనిండా దెబ్బలు తగిలి మానినట్లుగా గాట్లు,మచ్చలు ఉన్నాయి.మొరటుగా వున్న అతనిపెదవులమీద క్రూరమైన చిరునవ్వు మెదలింది. ఆనవ్వు అతని ముఖంలో వున్న భీకరత్వాన్ని రెట్టింపు చేసింది.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"EMESCO BOOKS","offers":[{"title":"Default Title","offer_id":47663880536320,"sku":"NR-X5RS-QQJU","price":110.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Anuraaga_Ganga_Yaddanapudi_Sulochanarani.jpg?v=1776085587","url":"https:\/\/www.sahithibooks.com\/products\/anuraga-ganga-yaddanapudi-sulochanarani","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}