{"product_id":"andaru-manushule","title":"andaru manushule","description":"\u003cp\u003eAndaru Manushule By VS RamaDevi\u003c\/p\u003e\n\u003cp\u003e'నవల' అంటే దేశకాల కాల పాత్ర భేదాలతో కొందరి జీవిత చరిత్రలను మేళవింపజేసి మనోహరంగా చెప్పే చక్కని కథ. నవల ఇటలీలో పుట్టి, ఫ్రాన్సులో పరిపక్వంపొంది, రష్యాలో గొప్ప ప్రయోజనాలు సాధించి, ఇంగ్లాండులోను, ఆఅమెరికాలోను ఇంటింటి దీపమై వికాసం పొందింది.\u003cbr\u003eరమాదేవిగారి నవల 'అందరూ మనుషులే'లో అన్ని రకాల ప్రవృత్తికలవారూ ఉన్నారు. ఈ 'చిత్తవృత్తుల చిత్రించడంలో కాని ఈ స్త్రీజనలోకంలో ఇంతమంది శ్రీమతులలో 'శశి'ని చిత్రించడంలో కాని ఆమె వెనకంజ వేయలేదు. ఒక స్త్రీ దృక్పథంలో తాను కన్నది కన్నట్లు, విన్నది విన్నట్లు, ఉన్నది ఉన్నట్లు రాశారు. ఆ కలానికి అడ్డులేదు. ఆ మాటలకు ఎదురుమాటలు లేవు. ఇన్ని పుటలు రాయడం ఎన్నో సుందరచిత్రాలతో కూడిన రంగు రంగుల తివాచీ వేసినట్లే.\u003cbr\u003eఈ నవలలో పాత్రలు నిజంగా జీవితంలో కనిపించే పాత్రలలాగ కనిపించవచ్చును. సాహిత్యం జీవితానికి ప్రతిబింబం. రమాదేవి కొన్ని సజీవ పాత్రలకు తన సాహిత్యదర్పణం పట్టింది. అంతమాత్రం చేత పురాణకథలోని గుమ్మడికాయల దొంగలాగున ఎవరూ బుజాలు తడుముకోనక్కరలేదు.\u003cbr\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books- a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":48930649604352,"sku":null,"price":114.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/andaru_manushule.jpg?v=1783155702","url":"https:\/\/www.sahithibooks.com\/products\/andaru-manushule","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}