{"product_id":"aahara-vaidyam-sai-lakkaraju","title":"Aahara Vaidyam","description":"\u003cp\u003eAahara Vaidyam by Sai Lakkaraju\u003c\/p\u003e\n\u003cp\u003eమనుష్యులకు గాక, రోగాలకు, బాధలకు మందులు అందజేయడంద్వారా ఆయా సమస్యలను వరిష్కరించగలనని ప్రగాఢంగా విశ్వసించాను. అనేక రోగాలకు కారణం మన జీవన విధానమే! ఆహారపు అలవాట్లను మార్చుకోవడం ద్వారా చాలారోగాలను దరికిరాకుండా చేయవచ్చును. ఉదాహరణకి శాఖాహారం, సాత్విక ఆహారము తీసుకునేవారికి ఉండే రోగనిరోధకశక్తి మాంసాహారులకు ఉండదని బలంగా నమ్మి ఏ ఆహారాన్ని ఎంతమోతాదులో తీసుకొనవచ్చునో, ఏయే రోగాలను రాకుండా నియంత్రించవచ్చునో, దీర్ఘకాలంగా ఉన్న రోగాలకు ఎంతకాలం మందులు వాడితే ఆ రోగాన్ని నిర్మూలించవచ్చునో అనే విషయాలపై పరిశోధనలు చేశాను. ప్రతి ఇంట్లో ఎల్లప్పుడూ లభ్యమయ్యే అల్లం, వెల్లుల్లి వంటి అనేక పదార్థాలను ఒక పద్ధతిగా వాడటంద్వారా రోగనిరోధక శక్తిని గణనీయంగా పెంచుకొని, ఎన్నో రోగాలను దరికిచేరనీయకుండా చేయగలము. ఈ గృహవైద్యాన్ని అనుభవ వైద్యమని కూడా అంటారు. వాస్తవానికి ఇది ప్రకృతి వైద్యము. వంటింట్లోదినుసులు కడుపునింపుకోవడానికేకాక, రోగాలని నయంచేయడానికి కూడా ఉపయోగపడతాయి అని చెప్పడమే ఈ గ్రంధ ముఖ్య ఉద్దేశ్యము. వూర్వీకులు కూడా తమ ఆహారపు అలవాట్ల ద్వారా దీర్ఘాయుష్షును, పూర్ణఆరోగ్యాన్ని పొందగలిగారు. ఏ దినుసులు, ఎంత మోతాదులో వాడాలో వీలైనంత సులభతరముగా, సరళమైన భాషలో చెప్పడానికి ప్రయత్నం చేశాను. మన వంటింట్లో వస్తువులు సరైన విధానంలో వాడటంద్వారా అనారోగ్యం బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు. దీర్ఘకాలంగా ఉన్నరోగాలు ఈ వైద్యవిధానంలో వాడుతూ ఉండగా కొంతకాలానికి ఉపశమనం ఉంటుంది. ఏ వైద్య విధానమైనా ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలనేది నా అభిమతం, వంటిల్లే వైద్యశాల అని, ఆ వంటింట్లో దినుసులే మందులని వీలైనంత క్లుప్తంగా తెలియజేశాను. ఈ గ్రంధం ప్రతి ఒక్కరికి ఉపయోగకరముగా ఉంటుందని భావిస్తున్నాను\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663914254592,"sku":"WO-GAR6-5OUN","price":110.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/cd4f80a5.jpg?v=1770616545","url":"https:\/\/www.sahithibooks.com\/products\/aahara-vaidyam-sai-lakkaraju","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}