{"title":"Sarat Chandra Chattopadhyay","description":null,"products":[{"product_id":"sarat-chandra-chattopadhyay-set","title":"Sarat Chandra Chattopadhyay Set of 9 Books Novels in Telugu","description":"\u003cp\u003eSarat Chandra Chattopadhyay Set of 9 Books Novels in Telugu\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cb\u003eశరత్ చంద్ర చట్టోపాధ్యాయ్\u003c\/b\u003e\u003cspan\u003e లేదా \u003c\/span\u003e\u003cb\u003eశరత్చంద్ర చట్టోపాధ్యాయ్\u003c\/b\u003e\u003cspan\u003e (బెంగాలీ: শরত্চন্দ্র চট্টোপাধ্যায়) (\u003c\/span\u003e\u003ca href=\"https:\/\/te.wikipedia.org\/wiki\/1876\" title=\"1876\"\u003e1876\u003c\/a\u003e\u003cspan\u003e \u003c\/span\u003e\u003ca href=\"https:\/\/te.wikipedia.org\/wiki\/%E0%B0%B8%E0%B1%86%E0%B0%AA%E0%B1%8D%E0%B0%9F%E0%B1%86%E0%B0%82%E0%B0%AC%E0%B0%B0%E0%B1%81_15\" class=\"mw-redirect\" title=\"సెప్టెంబరు 15\"\u003eసెప్టెంబరు 15\u003c\/a\u003e\u003cspan\u003e - \u003c\/span\u003e\u003ca href=\"https:\/\/te.wikipedia.org\/wiki\/1938\" title=\"1938\"\u003e1938\u003c\/a\u003e\u003cspan\u003e \u003c\/span\u003e\u003ca href=\"https:\/\/te.wikipedia.org\/wiki\/%E0%B0%9C%E0%B0%A8%E0%B0%B5%E0%B0%B0%E0%B0%BF_16\" title=\"జనవరి 16\"\u003eజనవరి 16\u003c\/a\u003e\u003cspan\u003e) ఇరవయ్యవ శతాబ్దపు ప్రముఖ బెంగాలీ నవలా రచయితా, కథా రచయితా. ఆయన నవలలు తెలుగునాట కూడా ప్రభంజనంలా ప్రాచుర్యం పొందాయి. సమాజాన్ని, వ్యక్తినీ లోతుగా అధ్యయనం చేసి సృష్టించిన ఆయన పాత్రలు, నవలలు చిరస్థాయిగా నిలిచిపోయాయి. తెలుగునాట నవలగా, చలన చిత్రంగా సంచలనం సృష్టించిన దేవదాసు ఆయన నవలే. చక్రపాణి మొదలైన అనువాదకులు ఆయనను తెలుగు వారికి మరింత దగ్గర చేసారు. చివరకు కొందరు పాఠకులు శరత్ బాబు తెలుగువాడేనని భావించేవారంటే, తెలుగులో ఆయన ప్రాచుర్యం ఎంతటిదో తెలుసుకోవచ్చు.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663867003136,"sku":"BT-Q9F1-EI4X","price":375.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Sarat_Chandra_Chattopadhyay_9_Novelsset.jpg?v=1782552052"},{"product_id":"devadas","title":"Devadas","description":"\u003cp\u003eDevadas దేవదాసు by  Sarat\u003c\/p\u003e\n\u003cp\u003eతెల్లవారింది, ఉదయంపూట జమీందారిగారి ఇంటిలోనుంచి మనుషులు బయటికొచ్చారు. ఎదురుగా ఆశ్చర్యకరమైన దృశ్యం! చెట్టుకింద ఒక మనిషి చచ్చిపోతూ వున్నాడు. చూడటానికి కులీనుడులాగా కన్పిస్తున్నాడు. శరీరంమీద శాలువా, పాదాలకు మెరుస్తున్న చెప్పులు, చేతిలో వుంగరం అలాగే పడివుంది. ఎడమచేతిమీద ఇంగ్లీషులో పేరులోని మొదటి అక్షరం పచ్చపొడిచి వుంది. ‘‘ఆ వ్యక్తి దేవదాసు’’ యీ కథ చదివినవాళ్లు ఎంతగానో క్షోభిస్తారు. అయినప్పటికీ దేవదాసువంటి దురదృష్టవంతుడు, సంయమనం లేనివాడు, పాపిష్టుడూ అయిన వ్యక్తితో ఎవరికైనా పరిచయం వుంటే వాళ్లు అతనికోసం పరమేశ్వరుని ప్రార్థించండి. ఇంకేమైనా కానివ్వండి. కాని దేవదాసు మృత్యువు లాంటిది ఎవరికీ సంభవించకూడదని ప్రార్థించండి. మృత్యువు సంభవించడంలో హాని ఏమీలేదు. కాని ఆ సమయంలో స్నేహహస్తపు స్పర్శ తలమీద తప్పకుండా వుండాలి. కరుణార్థ్రమై వున్న ఒక వదనాన్ని చూస్తూ చూస్తూ యీ జీవితం అంతం కావాలి. అందువల్ల మరణించే సమయంలో ఎవరి నయనాలనుండి అయినా రాలిన రెండు అశ్రుబిందువులు చూసి అతడు శాంతితో మరణించగలగాలి. శరత్ అద్భుత సృష్టి ‘దేవదాసు’ నవల సినిమాగా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఘన విజయం సాధించిన సంగతి పాఠకులందరికీ తెలిసిన విషయమే. ఇక చదవండి.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663874900224,"sku":"IM-TZ1P-90XW","price":68.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/DEVADASU.jpg?v=1782551694"},{"product_id":"chandranath","title":"Chandranath","description":"\u003cp\u003eChandranath చంద్రనాథ్  by  Sarat\u003c\/p\u003e\n\u003cp\u003eచంద్రనాథుని తండ్రి శ్రాద్ధానికి ఖచ్చితంగా ఒక రోజు ముందుగా అతడికీ, అతడి పినతండ్రికీ అభిప్రాయ భేదం ఏర్పడింది. అతడి బాబాయి పేరు మణి శంకర్ ముఖర్జీ. అభిప్రాయ భేదం కారణంగా శ్రాద్ధానికి సంబంధించిన కార్యకలాపాలన్నీ బాబాయి బాగానే పర్కవేక్షించాడు. కానీ స్వయంగా అతడూ భోజనం చేయలేదు. తన కుటుంబంలోని ఏ వ్యక్తినీ చేయనివ్వలేదు. బ్రాహ్మణుల భోజనాలు అయిపోగానే చంద్రనాథుడు బాబాయి దగ్గరకు వచ్చాడు. చేతులు జోడించి ‘‘బాబాయి గారూ! మీరు పెద్దవారు, తండ్రితో సమానమైనవారు. ఏదయినా అపరాధం జరిగి వుంటే ఈ సారి క్షమించండి’’ అన్నాడు. పితృతుల్యుడైన మణిశంకర్ ప్రత్యుత్తరంగా ‘‘నాయనా! నీవు కలకత్తాలోఇ ఉండి వచ్చావు. బి.ఏ.లు, ఎం.ఏ.లు పాసయ్యావు. విద్వాంసుడవు, తెలివి గలవాడివి. మేమంటావూ... మూర్ఖులము. అక్షరం ముక్క రాని అజ్ఞానులం. నీకూ, మాకూ పోలికేమిటి?’’ అన్నాడు. ఈ సామాన్యమైన విషయంలో పండితులూ, పామరులూ అనే చర్చ ఎందుకూ? బాబాయి సంకల్పాన్ని చంద్రనాథుడు బాగానే అర్థం చేసుకున్నాడు. బాబాయితో సంబంధం పెట్టుకోనని అతడు లోలోపల శపథ పూర్వకంగా నిశ్చయించుకున్నాడు.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663898755328,"sku":"51-5EJA-RFGI","price":40.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Chandranath.jpg?v=1782551898"},{"product_id":"palli-samaj","title":"Palli Samaj","description":"\u003cp\u003ePalli Samaj పల్లీ సమాజ్ by  Sarat\u003c\/p\u003e\n\u003cp\u003eదాదాపు ఓ వంద సంవత్సరాలకు పూర్వం అగ్రవర్ణానికి చెందిన బల్రామ్ ముఖర్జీ తన పేరుగల మిత్రుడు బల్రామ్ ఘోషాల్ను వెంటబెట్టుకొని విక్రమ్పుర్ వైపుకు బయలుదేరి యీ కువాన్పుర్ గ్రామంలోకి వచ్చి స్థిరపడిపోయాడు. ఈ కువాన్పుర్ గ్రామంలోని ఆస్తికికూడా ఒక చరిత్ర వున్నది. ముఖర్జీ కేవలం కులీనుడు మాత్రమే కాకుండా, చతురుడు, మంచి తెలివితేటలు గలవాడు కూడా. ఆయన అక్కడ తన వివాహం చేసుకొని ప్రభుత్వ ఉద్యోగంతోపాటు ఇంకా ఏమేమిటో చేసి కావలసినంత ఆస్తికూడబెట్టాడు. బల్రామ్ ఘోషాల్ కూడా ఈ విధంగానే తనపెళ్లి చేసుకొన్నాడు. కాని అతడు కేవలం తన తండ్రి అప్పులు తీర్చడంకోసం తప్ప మరేమీ సామర్థ్యం లేక ఆస్తి ఏమీ కూడబెట్టలేకపోయాడు. అంచేత కష్టాలలోనే కాలం గడుపుతూ వచ్చాడు. వివాహ సంబంధంగా కూడా మిత్రులిద్దరిలో కొంచెం మనస్పర్థలు యేర్పడ్డాయి. చివరకు రాను రాను ఆ మనస్పర్థలు పెరిగి వారిరువురి మధ్య వివాదంగా పరిణమించాయి. ఒకే గ్రామంలో వరసగా ఇరవై సంవత్సరాల నుంచి వున్నప్పటికీ కూడా ఒకరి ముఖం ఒకరు చూసుకోలేదు. చివరకు ఓ రోజు బల్రామ్ ముఖర్జీ మరణించాడు. ఆ రోజుకూడా ఘోషాల్ అతని ఇంట్లోకి అడుగుపెట్టలేదు. కాని అతడు మరణించిన మరుసటి రోజే ఆశ్చర్యకరమైన మాట ఒకటి వినిపించింది. బల్రామ్ ముఖర్జీ తన ఆస్తినంతటినీ సరి సమానంగా రెండు భాగాలుగా చేసి వాటిలో ఒక భాగాన్ని తన కుమారుడికీ, రెండోభాగాన్ని తన పేరుగల మిత్రుని కుమారుడికీ ఇచ్చేసి పోయాడని. ఇక చదవండి.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663902589184,"sku":"CM-PRHO-095Y","price":50.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Palli_Samaj.jpg?v=1782551727"},{"product_id":"viraj-bahu","title":"Viraj Bahu","description":"\u003cp\u003eViraj Bahu  by  Sarat\u003c\/p\u003e\n\u003cp\u003eదాదాపు ఓ వంద సంవత్సరాలకు పూర్వం అగ్రవర్ణానికి చెందిన బల్రామ్ ముఖర్జీ తన పేరుగల మిత్రుడు బల్రామ్ ఘోషాల్ను వెంటబెట్టుకొని విక్రమ్పుర్ వైపుకు బయలుదేరి యీ కువాన్పుర్ గ్రామంలోకి వచ్చి స్థిరపడిపోయాడు. ఈ కువాన్పుర్ గ్రామంలోని ఆస్తికికూడా ఒక చరిత్ర వున్నది. ముఖర్జీ కేవలం కులీనుడు మాత్రమే కాకుండా, చతురుడు, మంచి తెలివితేటలు గలవాడు కూడా. ఆయన అక్కడ తన వివాహం చేసుకొని ప్రభుత్వ ఉద్యోగంతోపాటు ఇంకా ఏమేమిటో చేసి కావలసినంత ఆస్తికూడబెట్టాడు. బల్రామ్ ఘోషాల్ కూడా ఈ విధంగానే తనపెళ్లి చేసుకొన్నాడు. కాని అతడు కేవలం తన తండ్రి అప్పులు తీర్చడంకోసం తప్ప మరేమీ సామర్థ్యం లేక ఆస్తి ఏమీ కూడబెట్టలేకపోయాడు. అంచేత కష్టాలలోనే కాలం గడుపుతూ వచ్చాడు. వివాహ సంబంధంగా కూడా మిత్రులిద్దరిలో కొంచెం మనస్పర్థలు యేర్పడ్డాయి. చివరకు రాను రాను ఆ మనస్పర్థలు పెరిగి వారిరువురి మధ్య వివాదంగా పరిణమించాయి. ఒకే గ్రామంలో వరసగా ఇరవై సంవత్సరాల నుంచి వున్నప్పటికీ కూడా ఒకరి ముఖం ఒకరు చూసుకోలేదు. చివరకు ఓ రోజు బల్రామ్ ముఖర్జీ మరణించాడు. ఆ రోజుకూడా ఘోషాల్ అతని ఇంట్లోకి అడుగుపెట్టలేదు. కాని అతడు మరణించిన మరుసటి రోజే ఆశ్చర్యకరమైన మాట ఒకటి వినిపించింది. బల్రామ్ ముఖర్జీ తన ఆస్తినంతటినీ సరి సమానంగా రెండు భాగాలుగా చేసి వాటిలో ఒక భాగాన్ని తన కుమారుడికీ, రెండోభాగాన్ని తన పేరుగల మిత్రుని కుమారుడికీ ఇచ్చేసి పోయాడని. ఇక చదవండి.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663904129280,"sku":"ET-AJZW-KHIR","price":45.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Viraj_Bahu.jpg?v=1782551757"},{"product_id":"majhli-didi","title":"Majhli Didi","description":"\u003cp\u003eMajhli Didi మఝిలీదీదీ Sarat \u003c\/p\u003e\n\u003cp\u003eకేప్టో తల్లి బియ్యం దంచి పెట్టి, అటుకులు కొట్టి పెట్టి, పేలాలు వేయించి పెట్టి, ఆ పనీ ఈ పనీ చేసిపెట్టి, అనేక కష్టాలు అనుభవించి కేప్టోధన్ను పదునాలుగేళ్ళ వాణ్ణి చేసి అమాంతంగా కన్ను మూసింది. అప్పుడు అతడికి గ్రామంలో నిలబడి ఉండటానికి చోటు లేకపోయింది. సవతి తల్లి కూతురు పెద్దక్క కాదంబిని పరిస్థితి బాగా ఉంది. ‘‘కేప్టో! నీ అక్క గారింటికి వెళ్ళి ఉండు. ఆమె కలిగినవాడి భార్య. బాగా ఉండగలవు’’ అన్నారు అందరూ. తల్లి పోయిన దుఃఖంతో ఏడ్చి ఏడ్చి కేప్టో జ్వరం కొని తెచ్చుకున్నాడు. చివరికి నయం అయిన తరువాత బిచ్చమెత్తి తల్లి శ్రాద్ధం పూర్తిచేసి, బోడి నెత్తితో ఓ చిన్న మూట ఆధారంగా తీసుకుని అక్కగారి ఊరు రాజహాట్ చేరుకున్నాడు. అక్క అతణ్ణి గుర్తుపట్టలేదు. తరువాత తెలుసుకుని, వచ్చిన కారణం విని అమాంతంగా మండిపడింది. ఆమె తన నియమానుసారంగా పిల్లలను పెట్టుకుని సంసారం జరుపుకుంటూ ఉంది. అకస్మాత్తుగా ఈ ఉపద్రవం వచ్చి పడింది. దారి చూపిస్తూ కేప్టోను వెంటబొట్టుకొచ్చిన ఆ పేటలోని వృద్ధుణ్ణి కాదంబిని కటువుగా నాలుగు చీవాట్లు పెట్టింది ‘‘భలేవాడివేలే అన్నయ్యా! నా పిన్ని కొడుకును పిలుచుకొచ్చావా ఉన్న సంపాదన ఊడ్చిపెట్టడానికి.’’ తరువాత తన సవతి తల్లిని ఉద్దేశిస్తూ ‘‘ఆ ముదనష్టపు ఆడది తాను బ్రతికుండగా ఒక్కనాడైనా మా మంచీ చెడ్డా కనుక్కున్నదా? ఉన్నారా, ఊడేరా అని విచారించిందా? మమ్మల్ని పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పుడు చచ్చిన తరువాత మర్యాద చేయటానికి కొడుకును పంపించిందా? వెళ్ళు, తీసికెళ్ళు అన్నయ్యా! ఈ పరాయిబిడ్డను తీసుకెళ్ళు. ఈ గొడవలన్నీ నేనెక్కడ సంభాళించుకోగలను?’’ అని ఈసడించింది. ఆ పసివాడు కేప్టో ఏమయ్యాడు? అతని అక్క అతనిని ఆదరించిందా, లేదా? తప్పక చదవండి ‘మఝిలీదీదీ’.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663908356352,"sku":"L6-HRUQ-9NG4","price":40.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/MAJHLI_DIDI.jpg?v=1782551863"},{"product_id":"vijaya","title":"Vijaya","description":"\u003cp\u003e Vijaya by Sarat\u003c\/p\u003e\n\u003cp\u003eఆ ముగ్గురు విద్యార్థులనూ హుగ్లీ బ్రాంచి స్కూలు హెడ్ మాస్టరుగారు తమ విద్యాలయం రత్నాలుగా భావించేవారు. ఆ ముగ్గురూ వేరు వేరుగా మూడు దారులగుండా ప్రతిరోజూ ఓ కోసు దూరం నడిచి వస్తుండేవాళ్ళు. ముగ్గురూ పరస్పరం ఎంతో ప్రేమతో వుండేవాళ్ళు. ఆ ముగ్గురు మిత్రులూ మార్గమధ్యంలో ఓ మర్రిచెట్టు క్రింద ప్రతిరోజూ సమావేశమవుతూ, ఆ తరువాత స్కూలుకు వెళ్ళేవాళ్ళు. ముగ్గురి ఇళ్ళూ హుగ్లీకి పడమటి దిక్కుగానే ఉండేవి. ఈ ముగ్గురు కుర్రవాళ్ళు, పట్టణంలో ఏదయినా ఇల్లు అద్దెకు తీసుకొని వుండకుండా, వానలకూ, వరదలకూ భయడపకుండా, చలికీ ఎండకూ బాధపడకుండా, ప్రతిరోజూ ఇంత దూరం కాలినడకనే వస్తూ పోతూ వుండడానికి కారణం ఒకటి వుంది. ఆ కాలంలో ఏ తల్లిదండ్రులూ తమ ముద్దు బిడ్డలు పడుతున్న ఈ కష్టాన్ని ఓ కష్టంగా లెక్కించేవాళ్ళు కాదు. కష్టపడనిదే ఆ తల్లి సరస్వతీదేవి కరుణించదని, ఆమె దీవెన ఉండదనీ వారి భావన. కారణమేదయినా ఆ ముగ్గురు మిత్రులూ ఇదే విధంగా వస్తూపోతూ హైస్కూలు పరీక్ష పాసయ్యారు. ప్రతిరోజూ ఆ మర్రిచెట్టు క్రింద కూర్చొని, ముగ్గురు మిత్రులూ ‘జీవితంలో మనం విడిపోగూడదు, ఎన్నడూ పెళ్ళి చేసుకోగూడదు. ముగ్గురం ప్లీడర్లమై ఒకే యింట్లో వుండాలి, డబ్బు సంపాదించి ఒకే బాక్సులో వేయాలి. ఆ డబ్బుతో దేశసేవ చేయాలి’ అని ప్రతిజ్ఞ చేస్తూ ఉండేవాళ్ళు. ఇవి వారి బాల్య జీవితపు ఊహా జగత్తులోని విషయాలు. ఊహలు కాకుండా, యధార్థమయిన దాని రూపం, చివరకు ఏమయిందో క్లుప్తంగా తెలియాలంటే చదవండి శరత్ నవల ‘విజయ’.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663910027520,"sku":"P0-SU6J-KGDZ","price":54.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/VIJAYA.jpg?v=1782551663"},{"product_id":"parineetha","title":"Parineetha","description":"\u003cp\u003eParineetha పరిణీత Sarat Novel\u003c\/p\u003e\n\u003cp\u003e‘‘నాన్నగారూ, నాన్నగారూ! అమ్మకు ఓ చిన్ని అమ్మాయి పుట్టింది’’ అంటూ గురుచరణ్బాబు మూడో కూతురు అన్నకాళీ యీ శుభవార్తను, వరండాలో కూర్చొని తన ఆలోచనలో మునిగివున్న తండ్రిచెవిన వేసింది. గురుచరణ్బాబు ధర్మపత్ని అయిదో కాన్పులో గూడా నిర్విఘ్నముగా కన్యారత్నాన్నే కన్నది. తన పదేళ్ళకూతురు అన్నకాళీ ద్వారా ఈ వార్త విని గురుచరణ్బాబు చాలా చింతాక్రాంతుడయిపోయాడు. యేమీ మాట్లాడలేకపోయాడు. బాగా శిథిలమైపోయిన తాతలనాటి తలగడను తలక్రిందికి జరుపుకొని పండుకొన్నాడు. అమ్మాయి పుట్టిందని వినగానే ఆ బలహీనుడు యెంతో నీరసించిపోయాడు. అతికష్టంమీద దీర్ఘంగా నిట్టూర్చాడు. చేతిలోని బెత్తంలాగా చిక్కి సగమైపోయిన ఆ శరీరమే అతడి బలహీనతకు సాక్ష్యం. ఆయన బాడుగబండి లాగే బక్కగుర్రం కన్న యేమీ మేలైనవాడు కాడు. నిరుద్యోగులతో నిండివుండే కలకత్తా మహానగంలో అరవై రూపాయల జీతంతో అరవచాకిరి చేస్తున్న ఈ చిరుద్యోగి గొప్పవాళ్ల గుర్రబ్బండి లాగే అరబ్బీగుర్రంలాగా యెలా బలిసి వుండదలడు? ఆ పరమేశ్వరుని దయవలన అతడు తన జీవిత చక్రాన్ని యేదోవిధంగా దొర్లించుకుపోతున్నాడు అదే పదివేలు!\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663910584576,"sku":"PC-Y90L-KLIE","price":45.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Parineetha.jpg?v=1782551789"},{"product_id":"naya-vidhaan","title":"Naya Vidhaan","description":"\u003cp\u003eNaya Vidhaan by sarath\u003c\/p\u003e\n\u003cp\u003eశైలేశ్వర్ కలకత్తాలో ఒక ప్రసిద్ధి చెందిన కాలేజీలో తత్వశాస్త్రం బోధించే అధ్యాపకుడు. ఆయన తత్వశాస్త్రంలో ఒక విదేశీ విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పుచ్చుకున్నాడు. ఆయన జీతం నెలకు ఎనిమిది వందల రూపాయలు. ఆయన వయసు ముప్ఫె రెండు సంవత్సరాలు. అయిదు మాసాల క్రితం తొమ్మిది సంవత్సరాల వయసుగల కొడుకును తల్లిలేని పిల్లవాణ్ణి చేసి ఆయన భార్య ఈ ప్రపంచంనుండి శాశ్వతంగా వీడ్కోలందుకుని వెళ్ళిపోయింది. ఇంట్లో ఆ తల్లిలేని పిల్లవాడు తప్ప మిగిలిన వాళ్ళు బేరరు, వంటవాడు, గుర్రాన్ని కాసేవాడు, గుర్రబ్బండి తోలేవాడు మొదలైనవాళ్ళు మొత్తం కలుపుకొని ఏడెనిమిది మంది నౌకర్లు ఉన్నారు. ఓ విధంగా ఈ నౌకర్లూ, చాకర్లే ఆ ఇంట్లో ఉండే జనాభా. శైలేశ్వర్ బాబుకు మొదట పెళ్లి చేసుకోవాలనే కోరిక లేదు. అలా వుండటం సహజమే. తరువాత ఆ కోరిక కలిగింది. ఆధునిక యుగంలో విద్యాధికుడయిన ఒక వ్యక్తికి ఇది ప్రత్యేకంగా కుతూహలం కలిగించేటంత విచిత్రమైన విషయమేమీ కాదు. అయినప్పటికీ ఆ రోజు శైలేష్ డ్రాయింగ్ రూంలో ఈ విషయం మీద సంభాషణ ప్రారంభమైంది. ఇక చదవండి.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663910715648,"sku":"PS-PGVA-2U3B","price":35.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Naya_Vidhaan.jpg?v=1782551933"},{"product_id":"badi-didi","title":"Badi Didi","description":"\u003cp\u003eBadi Didi బడదీదీ by Sarat\u003c\/p\u003e\n\u003cp\u003eప్రొద్దు వాలిపోతున్నది. కాళ్ళు ముందుకు కదలదలచుకోవడం లేదు. ఇంకా నాలుగు అడుగులేస్తే కాళ్ళు అసలు కదిలేటట్లుగా కన్పించడంలేదు. అందుకే జీవితం పరిసమాప్తమయ్యే శాశ్వతమైన విశ్రాంతి పొందడంకోసం, ఆఖరు మజిలీకి చేరుకోగలడానికి నిరంతరం ముందుకు సాగుతున్నాయి. మిగిలివున్న ప్రాణాల్నీ, మిగిలివున్న శక్తినీ పూర్తిగా ఖర్చుచేసి అంతిమంగా విశ్రమించే స్థలాన్ని అవశ్యం పొందదలచుకున్నాయి. మళ్ళీ తిరిగి ఎన్నడూ లేవకుండా వుండడంకోసం. నదిలోని ఆ మలుపులో ఒక పడవ గుబురుగా పెరిగిన గడ్డి పొదలను ప్రక్కకు తోసుకుంటూ దారి చేసుకొని వస్తున్నది. సురేంద్రనాథ్ బిగ్గరగా అరిచాడు... ‘‘బడదీదీ!’’  కాని శుష్కించిన కంఠం నుంచి శబ్దాలకు బదులు రక్తమే పడి వూరుకుంది. ‘‘బడదీదీ!’’ మరో రెండురక్తపు బొట్లు. ‘‘బడదీదీ!’’ మళ్ళీ మమతలేని రెండు రక్తపు బిందువులు. నదిలోవున్న ఆ గడ్డిపొదలు పడవ నడకను మందగింపజేశాయి. సురేంద్రనాథ్ దగ్గరగా చేరుకుంటున్నాడు. ఆయన మళ్ళీ పిలిచాడు ‘‘బడదీదీ!’’ ఎవరీ బడదీదీ? తప్పక చదవండి శరత్ అద్భుత రచన.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663912157440,"sku":"SP-ULM8-5UCN","price":35.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Badi_Didi.jpg?v=1782551958"}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/collections\/download_6922eaa9-8348-430b-bb1c-3d7e2caa0246.jpg?v=1785229762","url":"https:\/\/www.sahithibooks.com\/collections\/sarat-chandra-chattopadhyay.oembed","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}