{"title":"Rabindranath Tagore","description":null,"products":[{"product_id":"gora-rabindranath-tagore","title":"Gora","description":"\u003cp\u003e Gora   BY  Rabindranath Tagore\u003c\/p\u003e\n\u003cp\u003eగోరా  BY  రవీంద్రనాథ్ ఠాగూర్\u003c\/p\u003e\n\u003cp\u003eఒక ఇంగ్లీషు మత ప్రచారకుడు హిందూమతాన్ని, హిందూసంఘాన్ని దుయ్యబడుతూ పత్రికలలో వ్యాసం ప్రకటించగా, ఆ వ్యాసం చదివి గోరా మండిపడ్డాడు. స్వపక్షమునే సమర్థిస్తూ గ్రంథం పూర్తిచేశాడు. ఆ గ్రంథంలో ‘‘మనదేశాన్ని విదేశీ న్యాయస్థానంలో నిలిపి, విదేశీ న్యాయసూత్రాల ప్రకారం విచారించడానికి మనం నిరాకరించాలి. కీర్తి అపకీర్తుల విషయంలో మన భావాలు అడుగడుక్కూ విదేశీ కొలబద్దతో కొలిచే విధానంమీద ఆధారపడి వుండగూడదు. మన మాతృభూమి విషయంలో సంప్రదాయాలు, విశ్వాసాలు, శాస్త్రాల విషయంలో ఇతర్లకుగాని మనకు మనంగాని క్షమాపణ చెప్పుకునే దుస్థితికి దిగజారకూడదు’’ గోరా మనసు ఇటువంటి భావాలతో నిండిపోయింది. ఇంతటి ఉన్నతమైన అభిప్రాయాలను ఏర్పరచుకుని సనాతన సంప్రదాయాలను గౌరవిస్తూ, ఆచార వ్యవహారాలను ఖచ్చితంగా పాటిస్తూ అటు విదేశీయులని, ఇటు బ్రహ్మ సామాజికులని అసహ్యించుకొనే గోరా తన అభిప్రాయాలను ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది? \u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663873818880,"sku":"HQ-036D-LWRO","price":240.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/44955fe2.jpg?v=1770616461"},{"product_id":"kumudhini","title":"KUMUDHINI","description":"\u003cp\u003eKUMUDHINI by Rabindranath Tagore\u003c\/p\u003e\n\u003cp\u003eవిప్రదాసు స్నేహపూర్వకదృష్టిని ఆమెపట్ల పరపి ఇలా అన్నాడు. ‘‘కుముదినీ! ఇప్పుడు పడమటి దిక్కుగా వున్న మేఘాలు మరికొంతసేపటికి తూరుదిశకు వస్తాయి. సంసారంలో ఇటువంటి గాలి ఎప్పుడూ వీస్తూనే వుంటుంది. మేఘాల మాదిరే మనుష్యులు కూడా అటు యిటు సంచరిస్తూ వుంటారు. నీవు యెక్కడికి వెళితే అక్కడల్లా నీకు లక్ష్మీపీఠం యేర్పడుతుంది. ఇదే నా ఆశీర్వాదం తల్లీ!’’  విప్రదాసు పాదాలదగ్గర తలచేర్చి కుముదిని చాలాసేపు కూర్చుండిపోయింది. తుఫాను యెప్పుడయితే నావను తీరంనుండి లాక్కుపోవడానికి ప్రయత్నిస్తుందో అప్పుడే లంగరు మట్టిని ఆశ్రయించుకుని వుండి పడవ తీరాన్ని దాటి వెళ్ళకుండా అట్టే వుంచుతుంది. అలాగే కుముదిని హృదయం అన్నగారి పాదాల దగ్గరే నియుక్తం అయివుండాలని వాంఛిస్తోంది. కుముదిని తన భర్త అయిన మధుసూదన్ తన అన్నతో, తన పుట్టింటి బంధువర్గంతో ప్రవర్తించిన తీరు చూసింది. ఇప్పుడు అతను తన ఆంగ్ల మిత్రబృందంతో ప్రవర్తిస్తున్న తీరు చూస్తోంది. ఇప్పుడు అతను చాలా మంచివాడుగా అగుపిస్తున్నాడు. ఆయన ముఖంలో నవ్వు అనవరతం కనిపిస్తూనే వుంది. అయితే ఆయన ప్రకృతి చంద్రునివంటిది అనిపించింది ఆమెకు. ఒక ప్రక్క ప్రకాశవంతము, మరొకపక్క అంథకారబంధురము అయిన యీ వైచిత్య్రం ఆమెకు అక్కజం అనిపించింది. మధుసూదన్ యొక్క స్వభావాన్ని గురించి ఆమె యిప్పుడిప్పుడే ఆలోచిస్తోంది. అన్నగారి ప్రేమకు, భర్త అహంకార, నిరాదరణలకు మధ్య నలిగిపోయిన కుముదిని చివరికి ఏం చేసింది? చదవండి!\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663901671680,"sku":"A0-0URD-E4H0","price":90.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/2aa9ce10.jpg?v=1770616517"},{"product_id":"geethanjali-rabindranath-tagore","title":"Geethanjali","description":"\u003cp\u003eGeethanjali by Rabindranath Tagore\u003c\/p\u003e\n\u003cp\u003eగీతాంజలి\u003c\/p\u003e\n\u003cp\u003eGeetanjali by Ravindranath Tagore\u003c\/p\u003e\n\u003cp\u003eనీ నుంచి నేనేమీ కోరలేదు. నా పేరు కూడా నీ చెవిని వేయలేదు. వెళ్లివస్తావని నీవు సెలవు తీసుకొని వెళ్ళేటప్పుడు నేను మౌనంగా ఒక్కమాటైనా మాట్లాడకుండా నిల్చున్నాను, వాలుగా పడిన చెట్టునీడలో బావిగట్టుగా ఒంటిగా నిల్చున్నాను. మట్టి కుండలలో నీరు నింపుకుని ఆడంగులు యిళ్ళకు వెళ్లిపోయారు. ‘‘ప్రొద్దెక్కింది. నువ్వు రావూ?’’ అని నన్ను పిలిచారు. కాని నేను యేదేదో కలలు కంటూ యిక్కడే నిల్చిపోయాను. నీవు వచ్చేటప్పుడు నీ అడుగుల చప్పుడు నాకు వినిపించలేదు. దీనంగా వున్న కళ్ళతో నా వైపు చూచావు. అలసిన కంఠస్వరంతో నీవు మెల్లగా నాతో మాట్లాడావు. ‘‘నేనొక పాంథుణ్ని. నాకు దాహం వేస్తూంది’’ అన్నావు. పగటి కలలలో మునిగివున్న నేను నీ మాటలు విని ఉలిక్కిపడి లేచి నా కుండలో  నుంచి నీ దోసిట్లో నీరుపోశాను. పైన చెట్ల ఆకులు గలగలలాడాయి. చెట్ల కొమ్మలలో దాగిన కోకిల కూజితం చేసింది. ‘‘బాబ్లా’’ పూల పరిమళం త్రోవ కొననుంచి తేలుతూ వచ్చింది. నా పేరేమిటో చెప్పమని నీవు అడిగినప్పుడు నేను సిగ్గుతో తలవంచుకొని నిల్చున్నాను. అవును, నీవు నన్ను ఎల్లప్పుడూ గుర్తుంచుకోటానికి నీకు నేను చేసిందేమిటి? కాని నీ దాహం తీర్చటానికి నీరిచ్చారన్న జ్ఞాపకం యెప్పుడూ నా హృదయంలో పచ్చగా వుంటుంది. నా హృదయాన్ని ఎల్లప్పుడూ మాధుర్యంతో నింపివేస్తుంది. చాలా ప్రొద్దెక్కింది. వేపచెట్టు ఆకులు గాలికి గలగలలాడుతున్నాయి. అలాగే బావిగట్టున కూచుని కలలు కంటున్నాను.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663904293120,"sku":"EZ-9NHD-WLGQ","price":68.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/geethanjali.jpg?v=1784971662"},{"product_id":"padavamunaka","title":"PADAVAMUNAKA","description":"\u003cp\u003ePADAVAMUNAKA by Rabindranath Tagore\u003c\/p\u003e\n\u003cp\u003eధవళమైన చంద్రకాంతిలో రమేష్ ఆమెను అలా చాలాసేపు చూస్తూ కూర్చున్నాడు. వాళ్ళు ఇలా మొదటిసారి కలుసుకున్న సన్నివేశం ఎంతో విచిత్రంగా ఉంది. ప్రాణానికీ, మరణానికీ మధ్యనా అన్నట్లు నది మధ్యన ఇసుక తిన్నెలమీద ఇక్కడే మొదటిసారిగా ఆమెను చూడటం ఎంత విచిత్రమైన, విశిష్టమైన సన్నివేశం! ‘సుశీల చూడటానికి బాగుండదని అన్నదెవడు?’ రమేష్ సర్వమూ మరచిపోయాడు. అతనిలా అనుకున్నాడు ‘పెళ్ళి హడావుడిలో నేను ఈమెవంక చూడకుండా వుండటం కూడా మంచిదే అయింది. ఇప్పుడు ఇక్కడ చూస్తున్న విధంగా, చూడటానికి అవకాశం ఉండేది కాదు. ఆమెను పునరుజ్జీవింపచేసి నాకు నేనే సరికొత్త జీవనం తెచ్చుకుంటున్నాను. వివాహ మంత్రాల బంధంకంటే  ఈ బంధం వల్ల మా ఇద్దరికీ మరింత ఆప్యాయత, పూర్ణ ప్రేమ ఏర్పడతాయి. ఆ తతంగాలన్నీ పెద్దలకోసం మటుకే! ఇప్పుడు ఈమె నాకు సృష్టి ప్రసాదితంగా భావిస్తాను’. ఒకనాడు సాయంత్రం సరదాగా ఆమె జుట్టు ముడి పట్టుకు ఊపి ‘‘సుశీలా!! ఈ రకంగా ముడి వేసుకోవడం నాకు అందంగా కనిపించడం లేదు’’ అన్నాడు. ఆమె లేచి కూర్చుంది ‘‘చూడండి, ఎన్నిమార్లు చెప్పినా నన్ను ఇలా ‘సుశీలా! సుశీలా!’ అని పిలుస్తారేం?’’ అని అడిగింది. రమేష్ ఆమెవంక ఆశ్చర్యంగా చూశాడు. ఈ ప్రశ్న అతనికి అర్థం కాలేదు. తనని ఎంతగానో ప్రేమించే భర్తని ఆమె ఎందుకలా నిలదీయడం వెనుక వున్న పరిస్థితులేమిటి? తెలుసుకోవాలంటే చదవండి.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663907897600,"sku":"KE-LAUP-6LXY","price":81.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/f5a1f117.jpg?v=1770616528"},{"product_id":"choker-baali","title":"Choker Baali","description":"\u003cp\u003eChoker Baali by Rabindranath Tagore\u003c\/p\u003e\n\u003cp\u003e‘‘సరే మీ చదువు పాడుచేసుకోవద్దు. నాతో మాట్లాడుతారే, ఆ సమయాన్ని నేను మా స్నేహితురాలికోసం కేటాయిస్తాను. మరి అప్పుడు మాట్లాడతారా  ఆమెతో?’’ కరుణ అడిగింది. ఆంతర్యాల సంబంధాల విషయంలో ఉచితానుతాలు ఏమిటో, దాని ఆదర్శమేమిటో సామాన్యులకంటే అధికంగానే కుంజకు తెలుసును. తల్లి మనసు కించపడుతుందేమోనన్న ఉద్దేశంతో ఆదిలో వివాహమే వద్దన్నాడు. ఇప్పుడు కరుణను దృష్టిలో వుంచుకొని తన హృదయంలో మరొక స్త్రీకి స్థానం కల్పించడానికి అతనికి సుతరామూ ఇష్టంలేదు. ‘ఇన్న రోజులనుంచి ఇంట్లో వుంటే కుంజ ఒక్క పర్యాయం కూడా నన్ను చూడటానికి ప్రయత్నించలేదు. ఇంత నిర్లక్ష్యం దేనికో? నేనేమైనా జడపదార్ధాన్నా? స్త్రీని కాదా నేను? నన్ను ఒక్కసారి మాట్లాడించి వుంటే చున్నీకి, నాకూ ఎంత వ్యత్యాసం వున్నదో ఆయనకు తెలిసివుండేది’ అని మాయ తనలో తాను అనుకున్నది. పట్టుబట్టి తన భర్తచేత స్నేహితురాలితో మాట్లాడించి అమాయకురాలైన కరుణ, తాను మాత్రమే తన భార్యను అధికంగా ప్రేమిస్తున్నాడు అన్న అహంకారంతో కుంజబాబు, పెళ్ళయిన వ్యక్తి అని తెలిసి కూడా తనవైపు ఆకర్షింపజేసుకోవాలని పంతం పట్టిన మాయ... ఈ ముగ్గురి మధ్య జరిఏ మానసిక సంఘర్షణ చివరికి ఏ పరిణామాలకు దారితీసింది?\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663909634304,"sku":"OB-6B2Q-59ZB","price":90.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/b67ef8b8.jpg?v=1770616532"},{"product_id":"ravindra-kathavali","title":"Ravindra Kathavali","description":"\u003cp\u003eRavindra Kathavali by Rabindranath Tagore\u003c\/p\u003e\n\u003cp\u003eఇవాళ ఇంద్రాణి తన స్థిరత్వాన్ని కోల్పోయింది. ఆమె హృదయం పగిలిపోతోంది. విచ్చిపోయిన నల్లని మేఘాలవంటి ఆమె పెద్ద నేత్రాలు వేరైపోయినై. వాటిల్లో మెరుపు మెరుస్తోంది. ‘నా భర్తనేనా అవమానపరచింది!   విశ్వాసానికి, కృతజ్ఞతకు పరిణామం యిదేనా?’ ‘ఆదర్శప్రేమ’కు ప్రతీకయైన ఇంద్రాణి ఎందుకలా చేసింది? ‘హా! దురదృష్టమా! ఆకలితో గలగిల తన్నుకుంటున్న ఆ స్త్రీ వెంటనున్న బిడ్డ బైజనాథుడి పుత్రుడే. వందలకొలది బలసిన బ్రాహ్మణులు, సాధువులు, సన్యాసులు, పుతప్రాప్తి యాశ కల్పించి హల్వా, లడ్డూలు భుజించి పొట్టలు నింపుకుంటున్నారు. కాని ఆయన స్వంతబిడ్డకు ఒక రొట్టెముక్క కూడా లభించలేదు.’  తండ్రి చేస్తున్న ‘పుత్రకామేష్ఠి’ యాగంలో తన పుత్రుడే ఒక రొట్టెముక్కకు కూడా నోచుకోనంత మహౄపాపం ఏం చేశారు ఆ తల్లీకొడుకులు? ‘‘కుమూ! నేను మూఢుడ్ని, డాంభికుడ్ని కాదు. నిన్ను గుడ్డిదాన్ని చేసిందే కాకుండా నిన్నీ అంథకారకూపంలో వదలి మళ్ళీ పెళ్ళి చేసుకోను. ఆ కృష్ణభగవానుని మీద ఒట్టువేసి చెబుతున్నాను. ఒట్టు మారితే నేను బ్రహ్మహత్యా, పితృహత్యా ఘోరనరకాల ననుభవిస్తాను.’’ అంటూ ‘శుభదృష్టి’తో తన భార్యకు ఒట్టు వేసిన అవినాశ్ మళ్ళీ పెళ్ళికి సిద్ధపడేలా చేసిన పరిస్థితులేమిటి?\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663910945024,"sku":"Q9-1JOD-2OZZ","price":90.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/84cd81f9.jpg?v=1770616536"}],"url":"https:\/\/www.sahithibooks.com\/collections\/rabindranath-tagore.oembed","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}