{"title":"Polkampalli Shantadevi","description":null,"products":[{"product_id":"pushyami","title":"Pushyami","description":"\u003cp\u003ePushyami by Polkampalli Santhadevi\u003c\/p\u003e\n\u003cp\u003e‘‘భర్తగా నేను నీకు లేకపోవచ్చు.  కాని, స్నేహితుడిగా నేను నీకు ఎప్పటికీ ఉంటాను’’ పుష్యమి హాండ్ బాగ్ భుజానికి తగిలించుకొని కారు దగ్గరికి నడుస్తూ అంది : ‘‘మీరు తలుచుకొంటే ఏమైనా ఉండగలరు. నా నిగ్రహం మీద నాకే నమ్మకం లేదు. స్నేహం ప్రేమలోకి మారడం లోకసహజం. ప్రేమ స్నేహంగా మారగలదంటే - ఉహు, నేను నమ్మను. నేను మీలాగా మనసు మీద అధికారం సంపాదించిన రోజున, నా మీద నాకు విశ్వాసం ఏర్పడిన రోజున దేశాటనం రద్దు చేసుకొని తిరిగి వస్తాను. అపుడు మీ పద్మనిలయం కార్యక్రమాలలో నేనూ పాల్గొంటాను’’ పుష్యమి కారుడోర్ తెరుచుకొని తండ్రి పక్కన కూర్చొంది. కారు కదులుతూంటే, కారు పక్కగా నడుస్తూ అన్నాడు సరోజ్, ‘‘నువ్వలా తిరిగి వచ్చిన రోజునే నాకు నిజమైన మనశ్శాంతి అని గుర్తుంచుకో. ఆరోజు కోసం ఆశతో నిరీక్షిస్తుంటాను పుష్యమీ’’ అతడి కళ్ళు అప్పటికే ఆర్ర్దమయ్యాయి. కారు కనుమరుగయ్యేదాకా సరోజ్ చెయ్యూపుతూనే ఉన్నాడు.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663856288000,"sku":"21-GD0D-4EPR","price":72.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/3356e499.jpg?v=1770616425"},{"product_id":"sandhyaa-kalyaanam","title":"Sandhyaa Kalyaanam","description":"\u003cp\u003eSandhyaa Kalyaanam by Polkampalli Santhadevi\u003c\/p\u003e\n\u003cp\u003eఈ యుగంలో... ‘ఒక ఆడపిల్ల తన కాళ్లమీద తాను నిలబడితే సరిపోతుందా? ఏ పొలం పనికి వెళ్లినా మూడో, నాలుగో రూపాయలూ, శేరో, రెండు శేర్లో గింజలూ తెచ్చుకోగలదు. ఒక్క పొట్టకు తిండి సంపాదించుకోవడం కష్టమైన పని కాదు. ఆడపిల్లకు తిండికంటె, బట్టకంటె ముఖ్యంగా కావలసింది రక్షణ! ఆ రక్షణ ఏ మాత్రమూలేని సంధ్యలాంటి అతిసామాన్యురాలు, అభాగ్యురాలైన యువతి జీవిత దినదిన గుండమే... పైకి పచ్చపచ్చగా కనిపించే ఎన్నో ప్రాణాంతకమైన ఊబి గుంటలతో నిండినదీ లోకం... సంధ్యలాంటి స్వయం నిర్ణయశక్తిలేని అర్భకురాలి జీవితం ఎలాంటి ఒడిదుడుకులకు లోనవుతుంది? అదృశ్య విధిశక్తి నడిపించినట్టు నడవడమేనా? లేక స్వయం చోదకత ఉంటుందా? అరుణ్ వంటి సహృదయ యువకుడు తోడైతే జీవితం వాళ్ల పెద్దలు ఆశించినట్టు స్వర్గతుల్యమే. లేదా కత్తుల చెరువు... నేటి కాలపు యువతీ యుకవలు ద్వంద్వ స్వభావాలను... భయాన్నీ, నిర్భీతినీ, సంశయాన్నీ, స్వయం నిర్ణయశక్తినీ, బలహీనతలనూ, శక్తినీ చిత్రిస్తూ అన్ని విరుద్ధ అంశాలకూ అద్దం పట్టిన వినూత్న రచన. ‘సంధ్యా కళ్యాణం’ చదవండి!\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663856681216,"sku":"2A-VSV2-U61P","price":54.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/237d54c1.jpg?v=1770616425"},{"product_id":"premikaa-rani","title":"Premikaa Rani","description":"\u003cp\u003epremikaa rani by Polkampalli Santhadevi\u003c\/p\u003e\n\u003cp\u003e‘‘జీవితం చివరి మెట్టు మీద నిలబడిన మనిషికి ఈ ప్రపంచమంటే భయం వుండదు. ఎవరేమన్న లెక్కవుండదు. అందుకే ఇంత ధైర్యంగా నా జీవితంలోకి దాచుకొన్న రహస్యాన్ని చెప్పి వేయగలిగాను’’ అని ముగించి గీతాభవాని.  అయితే విషయం సామాన్యమైంది కాదు. పెళ్ళి కాని వయసు కన్నెపిల్ల మనసైన వాడికి  బలియై లోకాన్నెదిరించలేక మరొక అభాగ్య శిశువును కని కళ్లు తెరవని పసికందును అవతల పారేసింది. ఇపుడు ఇరవైయేళ్ల తర్వాత రాగూడని పరీక్ష రానేవచ్చింది. తనను కన్నకూతురిగా గుర్తిస్తే తప్ప రానని భీష్మించిన ప్రేమికారాణి హదయం ఇక్కడ లభించిన పిత ప్రేమకు పున్నమినాటి సముద్రంలా పొంగిపోయింది.  అన్నిటికీ మించి విశాల్ వంటి ధీరోదాత్తుడు, విశాల హదయుడు పట్టు వదలక తమ జీవిత వత్తాంతాలకు పరిష్కారం సాధించాడు.  ‘శుభం’ నుండి ‘సమాప్తం’ వరకు పదరసవంతమైన వినూత్న పాత్ర చిత్రణతో, జనన్వోపు నడక వంటి కధన కౌశలంతో సాగిన రచన.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store \u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663866577152,"sku":"BD-CBJ0-ELW0","price":72.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/34c4ae59.jpg?v=1770616445"},{"product_id":"kanne-vaagu-kode-naagu","title":"Kanne Vaagu: Kode Naagu","description":"\u003cp\u003eKanne Vaagu: Kode Naagu by Polkampalli Santhadevi\u003c\/p\u003e\n\u003cp\u003e‘‘ఒక కంట కన్నీరు ఒక కంట పన్నీరు కార్చాల్సిన సమయమిది. కన్నె కలలూ, కన్న కలలూ అన్నీ కాలి బుగ్గి అయిపోయినందుకు కన్నీరు.  పెళ్ళికి ముందు అతడెంత క్షుద్రుడో తెలిసి నన్ను నేను రక్షించుకొనే అవకాశం మిగిలి ఉన్నందున పన్నీరు’’ కన్నీళ్ళు తుడుచుకుంటూ నవ్వింది. ‘‘ఇంకా పెద్ద నేరస్తుడినే నా ముందు నిలబెడతానన్నావు. నా తీర్పు ఏమిటో చూస్తానని ఛాలెంజ్ చేశావు. నా తీర్పు ఇదే వైజయంతీ’’ ప్రదానం రోజు విహారి తన వేలికి తొడిగిన ముత్యపు టుంగరం తీసి వైజయంతి వేలికి తొడిగింది. ‘‘నువ్వు చాలా తెలివైనదానివే. ఎలా వంచింపబడ్డావని ఆశ్చర్యంగా ఉంది.’’ ‘‘అతడు నా కంటే తెలివైనవాడు కాబట్టి.’’\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663884632320,"sku":"RB-2OST-WXMR","price":63.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/b20b46cc.jpg?v=1770616481"},{"product_id":"manchu-mutyam","title":"Manchu Mutyam","description":"\u003cp\u003eManchu mutyam By  Polkampalli Santhadevi\u003c\/p\u003e\n\u003cp\u003eబోర్లా పడి ఉన్న ఆ స్త్రీ జాకెట్ మెడ దగ్గర చిరిగిపోయి ఉంది. చేతి గాజులు చిట్లి గదినిండా పడి ఉన్నాయి. జడ విచ్చుకుపోయి, జుట్టు భుజాల్నీ, ముఖాన్నీ కప్పివేసింది. కిశోర్ ధైర్యం కూడదీసుకొని ఆమెను సమీపించాడు. ఆమెను వెల్లకిలా పడపుకో బెట్టబోతూ షాక్ తిన్నట్టు మ్రాన్పడిపోయాడు. ‘‘మైగాడ్! యమున!’’ కిశోర్, యమునల వివాహం బొమ్మలపెళ్లిలా జరిగిపోయింది. ఆ పిల్ల మెడలో మాంగల్యం కట్టిన గుర్తు కూడా లేదు అతడికి. ఏడెనిమిదేళ్ల యమునకు కట్టబెట్టిన పట్టుచీర జారిపోతుంటే ముత్తయిదువుల నవ్వుకోవడం, చెండాట కూర్చోబెడితే నిద్ర ముంచుకువచ్చి ఆ పిల్ల తన ఒళ్లో తలపెట్టుకు పడుకోవడం మాత్రం లీలగా గుర్తున్నాయి అతడికి... కట్టుకున్న భర్తకు దూరమై, సుఖమనేది తెలియకుండా బ్రతుకు వెళ్లమార్చిన యమున అపరిపక్వమైన ఆలోచనలతో ఒక్కసారి తప్పటడుగు వేసింది. దానితో మంచుముత్యంలాంటి యమునను అందరూ అపార్థం చేసుకున్నారు. ఆమె జీవితానికి పుట్టిన గ్రహణం విడిచేనా? అడుగడుగునా ఊహించని మలుపులతో సాగిన ‘‘ఆంధ్రభూమి’’ మాసపత్రిక సీరియల్ ‘‘మంచుముత్యం’’ పోల్కంపల్లి శాంతాదేవి విశిష్ట రచన. చదవండి!\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663890432256,"sku":"WG-YWT2-JUHG","price":45.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/5e836870.jpg?v=1770616492"}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/collections\/images_a855af40-6ea3-4141-af33-d01405197504.jpg?v=1785235115","url":"https:\/\/www.sahithibooks.com\/collections\/polkampalli-shantadevi.oembed","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}