{"title":"Nanduri Ramamohanarao","description":null,"products":[{"product_id":"tom-sawyer-nanduri-ram-mohan-rao","title":"Tom Sawyer","description":"\u003cp\u003eTOM SAWYER BY NANDURI RAM MOHAN RAO\u003c\/p\u003e\n\u003cp\u003eఈ పుస్తకంలో వర్ణించిన సాహసాలలో చాలామటుకు నిజంగా జరిగినవే. వాటిలో ఒకటి రెండు నా సొంత అనుభవాలు. మిగిలినవి నా  సహాధ్యాయుల  అనుభవాలు. హక్ఫిన్  లాంటి  బాలుడు  నిజంగా  ఉండేవాడు. టామ్సాయర్ కూడా అంతే. కాని, టామ్ ఒకడు కాడు. నాకు తెలిసిన ముగ్గురు బాలుర గుణగణాలను చేర్చితే టామ్ పాత్ర తయారైంది. ఈ నవలలో పేర్కొన్న చిత్ర విచిత్రమైన నమ్మకాలు ఈ కథ జరిగిన రోజులలో - అంటే ఇప్పటికి ముప్ఫయి, నలభై ఏళ్ళ క్రిందట అమెరికా పశ్చిమ రాష్ట్రాలలో పిల్లలలోను, బానిసలలోను నిజంగా వుండేవి. నా పుస్తకం ప్రధానంగా బాలురకు, బాలికలకు వినోదం కోసం రాసినదైనా, ఆ కారణాన పెద్దవాళ్ళు దీన్ని చదవడం మానరని ఆశిస్తున్నాను. పెద్దవాళ్ళు తమ చిన్నతనంలో తాము ఎలా వుండేవారో, తమ ఆలోచనలు ఎలా వుండేవో, తాము ఎలా మాట్లాడేవారో, ఏ చిత్రమైన సన్నివేశాలలో తాము చిక్కుకునేవారో వారికి ఆహ్లాదకరంగా జ్ఞాపకం చేయడం కూడా ఈ నవలా రచన ఉద్దేశాలలో ఒకటి. హార్ట్ఫర్డ్, 1876\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663857926400,"sku":"33-SPGF-V8BM","price":90.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Tom_Sawyer_NANDURI_RAMMOHANRAO.jpg?v=1774444648"},{"product_id":"huckleberry-finn-nanduri-ram-mohan-rao","title":"HUCKLEBERRY FINN","description":"\u003cp\u003eHUCKLEBERRY FINN BY NANDURI RAM MOHAN RAO\u003c\/p\u003e\n\u003cp\u003eమార్క్ట్వేన్ (1835-1910) అమెరికాలోని మిస్సోరి రాష్ట్రంలో జన్మించాడు. నావికుడుగా, పత్రికా రచయితగా జీవితం ప్రారంభించాడు. అసలు పేరు శామ్యూల్ లాంగ్ హార్న్ క్లిమెన్స్. ‘‘మార్క్ట్వేన్’’ అనే మారుపేరుతో హాస్యరచయితగా సుప్రసిద్ధుడయ్యాడు. రెండు మూడుసార్లు ప్రపంచంమంతటా ఉపన్యాసాలిస్తూ పర్యటించాడు. 1900 ప్రాంతంలో మన  దేశానికి  కూడా  వచ్చాడు.  ఏ  కాలేజీల్లోను,  స్కూళ్ళల్లోను చదువుకోకపోయినా ఇతడు 1907లో ఇంగ్లండు వెళ్ళినప్పుడు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంవారు  ‘‘డాక్టర్  ఆఫ్  లిటరేచర్’’  పురస్కారంతో గౌరవించారు. గాఢమైన ప్రజాస్వామికవాది. మొదట్లో హాస్యం కోసమే హాస్య రచన చేశాడు. పరిణతి పొందినకొద్దీ ఈయన హాస్యంలో నిశితమైన వ్యంగ్యం అంతర్వాహినిగా నడిచింది. నిజమైన హాస్యం కరుణరసానికి దారితీస్తుందని మార్క్ట్వేన్ ఒకసారి అన్నాడు. ఉత్తమ శ్రేణికి చెందివుండి విస్తృత పాఠకాదరణ పొందిన కొద్దిమంది రచయితల్లో ఈయన ఒకడు. ‘‘హకల్బెరీఫిన్’’ నవలలో అమెరికన్ నీగ్రోల బానిసతనపు సమస్య చిత్రీకరించబడింది. పీడిత జాతులమీద మార్క్ట్వేన్కు గల సానుభూతి ఇందులో వ్యక్తమవుతుంది. టామ్సాయర్ శిష్యుడైన హకల్బెరీఫిన్ ఈ కథలో ముఖ్యపాత్ర.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663868477696,"sku":"CX-9T2N-J1PG","price":90.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Huckleberry_Finn_NANDURI_RAMMOHANRAO.jpg?v=1774444476"},{"product_id":"raju-pedha-nanduri-ram-mohan-rao","title":"Raju Pedha","description":"\u003cp\u003eRaju Pedha BY NANDURI RAM MOHAN RAO\u003c\/p\u003e\n\u003cp\u003eఒకడు రాచబిడ్డ, మరొకడు నిరుపేద. ఇద్దరూ ఒకే పోలిక. వారిద్దరూ ఒకరి స్థానాన్ని ఒకరు మార్చుకుంటే? ఈ  విచిత్ర  సన్నివేశం  ఆధారంగా  రాచనగరులో సంప్రదాయాలను వ్యంగ్యంగా, మురికివాడలలో జీవితాలను సానుభూతితో విమర్శిస్తూ, రెండింటిలో నివసించే మానవుల ఔన్నత్యాన్ని, నైచ్యాన్ని రసవంతంగా చిత్రిస్తూ, అమెరికన్ సాహిత్య మూలపురుషులలో ఒకడైన మార్క్ట్వేన్ రచించిన గొప్ప నవల ‘‘రాజు-పేద’’. సుమారు 55 ఏళ్ళనాడు ఆంధ్రపత్రిక సచిత్ర వారపత్రికలో మొదట సీరియల్గా, తర్వాత మళ్ళీ మళ్ళీ పుస్తకరూపంలో వెలువడి ఆంధ్ర పాఠకలోకాన్ని ఉర్రూతలూగించిన ఈ అనువాదం ఈ కొత్తతరానికి మా సరికొత్త పాత కానుక.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663881453824,"sku":"OD-FOPZ-9ROW","price":110.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Raju_Pedha_NANDURI_RAMMOHANRAO.jpg?v=1774444410"},{"product_id":"kanchana-dweepam-nanduri-ram-mohan-rao","title":"Kanchana Dweepam","description":"\u003cp\u003eKanchana Dweepam BY NANDURI RAM MOHAN RAO\u003c\/p\u003e\n\u003cp\u003eఅడుగడుగునా,  ముందేమి  జరుగుతుందో  అన్న  ఉత్కంఠ కలిగిస్తూ,  అందమైన  కథ  చెప్పడంలో  రాబర్ట్  లూయీ  స్టీవెన్సన్ సిద్ధహస్తుడు. దానికి ఈ ‘‘కాంచనద్వీపం’’ (ట్రెజర్ ఐలెండ్) నవలే నిదర్శనం. ఇందులో కథానాయకుడు జిమ్ హాకిన్స్ అనే బాలుడు. దూర సముద్రాలపై,  కాంచన  ద్వీప  యాత్రలో,  ఓడ  దొంగల  మధ్య చిక్కుకుని, అతడు చేసిన సాహస కృత్యాలు ఎన్నిసార్లు చదివినా, మళ్ళీ చదివాలనే వుంటుంది. మళ్ళీ మీ చిన్నతనపు రోజులు జ్ఞాపకం వస్తాయి. మీ స్కూలు రోజుల్లో, ఏయే సాహసాలు చేయాలని పగటి కలలు కనేవారో అవన్నీ మదిలో మెదులుతాయి. ఇలా మనకి కూడా జరిగితే ఎంత బాగుండుననిపిస్తుంది. ఈ నవలానువాదం మొదట 1951-52 ప్రాంతాలలో ఆంధ్రపత్రిక సచిత్రవారపత్రికలో సీరియల్గాను, ఆ తర్వాత పలుసార్లు పుస్తకరూపంలోను   వెలువడినప్పుడు   ఆనాటి   పాఠకులను ఉర్రూతలూగించింది.   మళ్ళీ   ఈ   తరం   పాఠకులకు   దీన్ని అందజేస్తున్నందుకు సంతోషిస్తున్నాము.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663901409536,"sku":"9O-X9BZ-JFWK","price":80.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Kanchana_Dweepam_NANDURI_RAMMOHANRAO.jpg?v=1774444321"},{"product_id":"vichitra-vyekthi-nanduri-ram-mohan-rao","title":"Vichitra Vyekthi","description":"\u003cp\u003eVichitra Vyekthi BY  NANDURI RAM MOHAN RAO\u003c\/p\u003e\n\u003cp\u003e‘‘మీ జాతి చరిత్రలో ఇన్ని సామ్రాజ్యాలు, నియంతృత్వాలు, మతాలు సంభవించాయంటే దానికి ఒకటే కారణం. ప్రతి వ్యక్తికి పొరుగువాడిమీద అపనమ్మకం. ప్రతివ్యక్తికీ పొరుగువాడికి తనమీద సదభిప్రాయం ఉండాలని, లేకపోతే తను దుంపనాశనమైపోతానని భావిస్తాడు. ఇలా భావించడంవల్లనే, ఇది ఆధారం చేసుకుని ఇన్ని రాజ్యాలు, మతాలు వెలిశాయి. ఇంకా వెలుస్తాయి. మిమ్మల్ని ఇంకా అణగదొక్కుతాయి, ఇంకా అధోగతికి లాక్కుపోతాయి. ఎందుకంటే మీరు అల్పసంఖ్యాకులకు బానిసలు. ఈ బానిసతనం మీకు పోదు. మీ జాతి గొర్రెలమంద-’’ ఈ మాటలు ముగిస్తూ సైతాను అంతర్థానమయ్యాడు.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663902720256,"sku":"AK-5UBG-DJ70","price":68.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/Vichitra_Vyekthi_Nanduri_Rammohan_Rao.jpg?v=1774444254"}],"url":"https:\/\/www.sahithibooks.com\/collections\/nanduri-ramamohanarao.oembed","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}