{"title":"Kommanapalli Ganapathi Rao","description":null,"products":[{"product_id":"sila-saasanam-kommanapalli-ganapathi-rao","title":"Silaa Saasanam","description":"\u003cp\u003eSilaa Saasanam శిలా శాసనం by  Kommanapalli Ganapathi rao\u003c\/p\u003e\n\u003cp\u003eతెలుగు భాషలో మంచి కమేండ్ ఉన్న నువ్వు తెలుగు టైటిల్ పెట్టడమే బాగుంటుంది అంటూ ఆలోచించమన్నారు. పదిహేను టైటిల్స్ రాసిచ్చాను వెంటనే. అందులో ‘శిలాశాసనం’ ఫైనలైజ్ చేశారు గురుతుల్యులు దాసరిగారే. అలా ఓ హిట్ నవల రాసే అవకాశం కల్పించిన దాసరిగారికి...\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663876210944,"sku":"JF-44Z9-29H2","price":125.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/5e2f4595.jpg?v=1770616465"},{"product_id":"the-writer-kommanapalli-ganapathi-rao","title":"The Writer","description":"\u003cp\u003eThe Writer By \u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=Kommanapalli%20Ganapathi%20Rao\"\u003eKommanapalli Ganapathi Rao\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003ca href=\"http:\/\/www.emescobooks.com\/writers.php?more1=Kommanapalli%20Ganapathi%20Rao\"\u003e\u003cb\u003eది రైటర్\u003c\/b\u003e \u003cb\u003eకొమ్మనాపల్లి గణపతిరావు\u003c\/b\u003e\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eఓ కవి పిడికిట బిగుసుకున్న కలం మూగవోయిన తన గళానికి మాటలు కూర్చుకుని వ్యధిత వ్యాకుల హృదయంతో అంటోందీ…\u003c\/p\u003e\n\u003cp\u003e”నా గుండెలోతుల్లో నిక్షిప్తమైన రుధిరాన్ని నొసట కక్కించిన\u003c\/p\u003e\n\u003cp\u003eఓ నేస్తం! నీ చేతివ్రేళ్ళ స్పర్శతో నన్నో రాగవిపంచిగా మార్చి విశ్వజనీన సంగీతానికి రససృష్టిని చేయక కవోష్ణ రక్తధారల్ని నా గొంతునుంచి ఎందుకు కక్కిస్తావయ్యా!\u003c\/p\u003e\n\u003cp\u003eనా కంఠసీమను కసిగా నొక్కి నేను రాల్చిన అక్షరాల తోరణాలను నవ్యచరితకు నాందిగా మార్చక నీవు సృష్టించాలని తలపోసే మారణహోమంలో నన్ను సమిధను చేయడం న్యాయమా?\u003c\/p\u003e\n\u003cp\u003eఅయ్యో! నీ సాహిత్య సుక్షేత్రంలో నన్ను హలంగా మార్చక\u003c\/p\u003e\n\u003cp\u003eనీ గుండెను మండించే గరళానికి నన్ను ఆయుధంగా వాడుకోవడం నీకు పాడియౌనా?”\u003c\/p\u003e\n\u003cp\u003e”అక్కటా… ఎంతటి దయలేనివారయ్యా మీ జాతివాళ్ళు”\u003c\/p\u003e\n\u003cp\u003eప్రతి అక్షరం, ప్రతి వాక్యం ఓ రసరమ్య సాహితీ తోరణం.\u003c\/p\u003e\n\u003cp\u003eచదివి ఆనందించే పాఠకులకు ‘ది రైటర్’ ఓ అద్భుతకానుక\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663903801600,"sku":"EH-FBZA-FHD3","price":70.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/TheWriter-1_3da38fe3-6446-41c8-8f1d-1ecbdf3d544b.jpg?v=1772197345"},{"product_id":"rakoyee-anukoni-athithi","title":"Rakoyee Anukoni Athithi","description":"\u003cp\u003eRakoyee Anukoni Athithi by \u003cspan class=\"Y2IQFc\" lang=\"en\"\u003eKommanapalli Ganapathirao.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan class=\"Y2IQFc\" lang=\"en\"\u003eనిన్నటి నా ప్రియనేస్తం... నన్ను అంతగా అభిమానించిన నువ్వు వేల కోట్ల బాసలతో బాసటగా వున్నావనుకున్నానే... ఏమయ్యావు నువ్వు?  అందరి వెనకా నీడల మాటున దాగుని నాకెందుకు దూరమయ్యావు... ఎంత ఎదురుచూశాను నీకోసం? పచ్చిక మీద కూచుని నిరీక్షించడం అలవాటైన నేను జైలుగోడలకి గోడుని వినిపిస్తూ, నువ్వు వస్తావన్న ఆకస్మిక వైభవం కోసం ఎన్ని నిద్రలేని రాత్రుల్ని గడిపానో నీకెలా చెప్పను? నా ముఖాన్ని ప్రపంచానికి చూపించలేక ముష్టిదాని మల్లే ఏ దివ్యక్షణంలో అయినా దోసిలిలోకి రాలిపడే నీ ప్రేమభిక్ష కోసం అహోరాత్రులు ఎంత తపించానో నీకెలా వివరించను? ఇపుడెందుకయ్యా. ఇంత జరిగాక నాకెందుకు కనిపించావు? నిన్నూ, నీ ఉనికిని కాదనుకున్న నేను దుమ్ముతో నిండిన రాజబాటపై చాలా ముందుకు సాగిపోయానే. నీకు మాత్రమే నైవేద్యం కావాలనుకున్న బ్రతుకుని అంగడిలో పెట్టి అమ్ముకుంటూ బ్రతకడం అలవాటు చేసుకున్నానే... అన్ని పూలూ అమ్ముడు పోయేక ఈ ఖాళీ పూలసజ్జలో ఏముందని ఇలా వచ్చావు.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan class=\"Y2IQFc\" lang=\"en\"\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663905702144,"sku":"GW-53YL-Z5YA","price":56.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/471b43a1.jpg?v=1770616525"},{"product_id":"major-sangram","title":"Major Sangram","description":"\u003cp\u003eMajor Sangram by \u003cspan class=\"Y2IQFc\" lang=\"en\"\u003eKommanapalli Ganapathirao.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eమిలిటరీ ఇంటలిజెన్స్ ఆఫీసరుగా, శతృ స్థావరాలోలకి చొచ్చుకుపోగల సాహసవంతుడిగా, దేశ సరిహద్దుల్ని వాటి మాతృభూమిలో అడుగుపెట్టే ఉగ్రవాదుల్ని ఎదుర్కొనే శౌర్య పరాక్రమాలలో త్రివిధ దళాల అధిపతుల మన్ననల్ని అందుకున్న ఒకే ఒక వ్యక్తి, అసాధారణ చరిత్రగల మేజర్ సంగ్రామ్. ప్రళయ ప్రభంజనంలా టెర్రరిజం నగరమంతా వణికిస్తున్న సమయంలో పై సంఘటనకు కారకులైన కరుడుకట్టిన తీవ్రవాదుల్ని పట్టుకోగలిగాడా? వారిని అంతమొందించాడా? కొమ్మనాపల్లి గణపతిరావుగారి మరో అద్భుత విరచితం ‘‘మేజర్ సంగ్రామ్’’.\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":47663910846720,"sku":"Q5-CZHA-6MNX","price":42.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/72d88f3f.jpg?v=1770616536"},{"product_id":"agnihotrudu-kommanapalli-ganapathirao-novel","title":"Agnihotrudu","description":"\u003cp\u003eAgnihotrudu by Kommanapalli Ganapathi Rao\u003c\/p\u003e\n\u003cp\u003eఅగ్నిహోత్రుడు కొమ్మనాపల్లి గణపతిరావు\u003c\/p\u003e\n\u003cp\u003eఒక మృతి... ఒక అగ్నికుండం...\u003cbr\u003eఒక జన్మాంతర రహస్యం...\u003cbr\u003eభర్తగా జీవించినవాడు,\u003cbr\u003eపునర్జన్మ ఎత్తి బాలుడిగా తిరిగి వచ్చాడు.\u003cbr\u003eకానీ...\u003cbr\u003eఆమెకు తెలియదు.\u003cbr\u003eఆమె మరో పెళ్లి చేసుకుంది.\u003cbr\u003eగుర్తు లేని ఆమె హృదయం,\u003cbr\u003eగుర్తుకొచ్చే అతని ఆత్మ...\u003cbr\u003eవిధి వారిద్దరినీ మళ్లీ కలిపిందా?\u003cbr\u003eలేక... కాలమే వారిని శాశ్వతంగా\u003cbr\u003eవేరు చేసిందా\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":48888823218432,"sku":null,"price":135.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/AgnihotruduKommanapalliGanapathiRao.jpg?v=1782387904"},{"product_id":"sathagni-kommanapalli-ganapathi-rao","title":"Sathagni","description":"\u003cp\u003eSathagni Kommanapalli Ganapathi Rao\u003c\/p\u003e\n\u003cp\u003eశతఘ్ని కొమ్మనాపల్లి గణపతిరావు\u003c\/p\u003e\n\u003cp\u003eఅతనో తెలుగు అబ్బాయి. ప్రపంచ దేశాలలో అత్యున్నతమైన స్థానం గల ప్రముఖ దినపత్రిక న్యూయార్క్ టైమ్స్కి కరస్పాండెంట్గా పనిచేసిన వ్యక్తి. అమెరికన్ వైట్హౌస్ స్కాండల్స్ని బయటపెట్టి అమెరికా లాంటి అగ్రరాజ్యనేతకి నిద్రపట్టకుండా చేసిన ధీశాలి.\u003cbr\u003eఅటువంటి వ్యక్తి మన దేశంలో మాఫియా డాన్స్లా వ్యవహరిస్తున్న రాజకీయ నాయకులపై బాహాటంగా చేసిన తిరుగుబాటే ఈ ‘‘శతఘ్ని.’\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":49037022298368,"sku":null,"price":160.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/SathagniKommanapalliGanapathiRao.jpg?v=1784617344"},{"product_id":"hamsadwani-kommanapalli-ganapathi-rao","title":"Hamsadwani","description":"\u003cp\u003eHamsadwani Kommanapalli Ganapathi Rao\u003c\/p\u003e\n\u003cp\u003eహంసధ్వని కొమ్మనాపల్లి గణపతిరావు\u003c\/p\u003e\n\u003cp\u003eజైలు గోడలు దాటి విశాల ప్రపంచంలోకి సరికొత్త ఆలోచనతో అడుగుపెట్టిన భార్గవకు, తొలిసారిగా ఎదురైంది యామిని.\u003cbr\u003eఎన్నో యుగాల అన్వేషణ ఫలించిన సంతృప్తి ఆమెకళ్ళలో...\u003cbr\u003eఏదో చేయాలన్న కృతనిశ్చయం భార్గవ మనసులో...\u003cbr\u003eఅనుకున్న లక్ష్యం నెరవేరేవరకూ ఆమెకు దూరంగా ఉండాలన్న ఆలోచన.\u003cbr\u003eజైలు జీవితం తెచ్చిన నిర్లిప్తత.\u003cbr\u003eచివరికి ఏమవుతాడో తెలియని విచిత్రస్థితి.\u003cbr\u003eఅలసిపోయిన జీవనయానంలో కెరటంలా పైకి దూకి విరిగి వెనక్కి వెళ్ళిపోయిన గాంధి, అలలా ఒడలును తాకి కలలా కరిగిపోయిన హసీనా, ఓటమిని గుండెలకు గాక గెలుపునకు అన్వయించుకొమ్మని ఉద్బోధించిన సంఘటనలు- మరెన్నో గుర్తులు.\u003cbr\u003eనలిగిపోయిన జీవితడైరీలో కరిగిపోయిన అక్షర స్మ•తులు.\u003cbr\u003eభవిష్యత్తు గురించి అతడెప్పుడో నిర్ణయించుకున్నాడు\u003cbr\u003eఈ కాలుష్య వాతావరణానికి దూరంగా మరెక్కడికో సాగిపోవాలని.\u003cbr\u003eఅతని పయనమెటు?\u003cbr\u003eఅతని గమ్యమేమిటి\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":49037038256384,"sku":null,"price":115.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/HamsadwaniKommanapalliGanapathiRao.jpg?v=1784617733"},{"product_id":"hamsageetham-kommanapalli-ganapathi-rao-novel","title":"Hamsageetham","description":"\u003cp\u003eHamsageetham Kommanapalli Ganapathi Rao\u003c\/p\u003e\n\u003cp\u003eకిటికీ ఆవల హిమాస్నాతమాలతీలతని చూసినప్పుడో హేమంత సమీరం నా శరీరాన్ని తాకి వెళ్ళినప్పుడో... లేదూ అపరాత్రివేళ మీ గది స్వప్నాలతో నిండినప్పుడు నేను స్వగతాలతో కుస్తీ పడుతూ ఎన్నిరోజులు ఆందోళనగా గడిపిందీ మీరూహించలేరు. నాకోసం కాదు... అక్కకోసం ... అక్క స్నేహకాదని తెలిస్తే మీరు సహిస్తారా అన్న సత్యాన్ని అన్వేషించడంకోసం.\u003cbr\u003eమీరు సంస్కారవంతులు అమరేంద్రా. నన్ను మించిన సహృదయత కల అక్కని త్రికరణశుద్ధిగా మీరు అంగీకరిస్తారు. అంగీకరించాలి. ఇది నా చివరి అభ్యర్థన.\u003cbr\u003eఅక్క కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన స్నేహ, చెల్లెల్ని అపార్థం చేసుకున్న అక్క!\u003cbr\u003eరసరమ్య ప్రేమకావ్యం చదవండి\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":49037039108352,"sku":null,"price":135.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/HamsageethamKommanapalliGanapathiRao.jpg?v=1784786467"},{"product_id":"agniswaasa-kommanapalli-ganapathi-rao","title":"Agniswaasa","description":"\u003cp\u003eAgniswaasa Kommanapalli Ganapathi Rao\u003c\/p\u003e\n\u003cp\u003eఅగ్నిశ్వాస కొమ్మనాపల్లి గణపతిరావు\u003c\/p\u003e\n\u003cp\u003e‘‘ఎవరు నువ్వు? అసలు నిన్నెందుకు నేను కోరుకుంటున్నాను... కోరి ఎందుకు నా స్థానంనుంచి జారిపోతున్నాను యూ డేమ్ ఫూల్...నాకు వ్యాపార బంధం కాక మానసిక బంధానికి అర్థమెలా తెలుస్తుంది?’’ ఆమె ఉద్విగ్నతని అధిగమిస్తూ వెక్కిళ్ళు ఉధృతమౌతుంటే మామూలు ఆడపిల్లలా ఏడ్చేస్తూంది. నేను కోరని స్మ•తుల శకలాన్ని సున్నితంగానైనా స్ప•శిస్తున్న శశాంకా...  \u003cbr\u003e‘‘నేనెవరిననుకుంటున్నావు? నాలో ఏ రక్తం ప్రవహిస్తుందను కుంటున్నావు? మూడేళ్ళ ప్రాయంలోనే అమ్మ పొత్తిళ్ళనుంచి నిర్దాక్షిణ్యంగా నేల జారిన ఆడపిల్లనయ్యా... ఒక్క లిక్కర్ బాటిల్ కోసం అప్పుడెప్పుడో కన్నతండ్రిచేతనే అమ్మబడిన అరుదైన అదృష్టవంతురాలిని. ఇంతకు మించి సంస్కారాన్ని నా నుండి ఎలా ఆశిస్తున్నావు... ఆ.’’\u003cbr\u003eశశాంక్ మీద చూపిస్తున్న కోపం నిజమేనా? ప్రేమ ఎలా చూపించాలో తెలియక సతమతమౌతుందా?\u003cbr\u003eఅగ్నినే శ్వాసగా మలుచుకున్న శశాంక్ ఎలా స్పందిస్తాడో తెలుసుకోవాలంటే... చదవండి ఈ ‘‘అగ్నిశ్వాస’’\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":49037049987328,"sku":null,"price":180.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/AgniswaasaKommanapalliGanapathiRao.jpg?v=1784786371"},{"product_id":"the-judgement-kommanapalli-ganapathi-rao-novel","title":"The Judgement","description":"\u003cp\u003eThe Judgement Kommanapalli Ganapathi Rao\u003c\/p\u003e\n\u003cp\u003eది జడ్జిమెంట్ కొమ్మనాపల్లి గణపతిరావు\u003c\/p\u003e\n\u003cp\u003e‘‘పెళ్ళన్నది స్వర్గంలోనే నిర్ణయించడం నిజమైతే మగవాడైన దేవుడు ఆడదానికి అక్కడే అన్యాయం చేశాడు. ఆ తప్పుని నేను ధి•క్కరిస్తాను. మూల్యం ఎంతైనా భరిస్తాను’’ అంటూ ఓ యువతి హిందూవైవాహిక ధర్మసూత్రాలపై విసిరిన సవాల్\u003c\/p\u003e\n\u003cp\u003eSold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store\u003c\/p\u003e","brand":"SAHITHI PRACHURANALU","offers":[{"title":"Default Title","offer_id":49037050642688,"sku":null,"price":135.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/files\/bb192a35-d189-48c5-89ce-0f27458f789b.jpg?v=1784634955"}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0816\/9232\/8192\/collections\/Kommanapalli_ganapatirao_writer.jpg?v=1784958952","url":"https:\/\/www.sahithibooks.com\/collections\/kommanapalli-ganapathi-rao.oembed","provider":"Sahithi Books","version":"1.0","type":"link"}